చాలామంది జీవిత లక్ష్యం ఏంటంటే... ఒక ఇల్లు, కారు కొనడం. అందుకే చిన్నదో పెద్దదో ఉద్యోగం రాగానే మొట్టమొదటిగా ఈ రెండిటినీ కొనడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇల్లు కొనడం చాలా ఖరీదైన విషయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం రూ.50 లక్షలు లేనిదే సింగల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కూడా కొనలేం. అందుకే రెండో లక్ష్యమైన కారు కొనడానికి అందరూ ఉత్సాహం చూపిస్తారు.