BSNL: ఈ మూడు రీఛార్జ్ ప్లాన్లు నిలిపివేస్తున్నారు.. మీ రీఛార్జ్ ప్లాన్ లో ఇవున్నాయా?

Published : Feb 06, 2025, 02:49 PM IST

మీరు బీఎస్ఎన్ఎల్ వినియోగదారులా? అయితే మీరు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. బీఎస్ఎన్ఎల్ త్వరలో కొన్ని రీఛార్జ్ ప్లాన్లను నిలిపివేయనుంది. వాటిని మీరు కూడా రీఛార్జ్ చేసుకుంటున్నారేమో ఇక్కడ చెక్ చేసుకోండి. 

PREV
14
BSNL: ఈ మూడు రీఛార్జ్ ప్లాన్లు నిలిపివేస్తున్నారు.. మీ రీఛార్జ్ ప్లాన్ లో ఇవున్నాయా?

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీ పడుతూ బిఎస్ఎన్ఎల్ కూడా తక్కువ ధరకే ప్లాన్లను అందిస్తోంది. 4జి సేవలు ఇంకా ప్రారంభించకపోయినా బిఎస్ఎన్ఎల్ కి దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. రీఛార్జ్ ప్లాన్స్ కూడా ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోలిస్తే చాలా తక్కువ ధరకే బిఎస్ఎన్ఎల్ అందిస్తోంది. అందుకే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వినియోగదారులు కూడా బిఎస్ఎన్ఎల్ లోకి మారుతున్నారు. 

24

అయితే కొత్త ప్లాన్స్ తీసుకొస్తున్న నేపథ్యంలో కొన్ని పాత ప్లాన్స్ ను నిలిపివేయాలని బిఎస్ఎన్ఎల్ నిర్ణయించింది. అయితే ఈ ప్లాన్లు నిలిపివేసినా వాటి స్థానంలో వినియోగదారులకు మరిన్ని సదుపాయాలు కల్పించేలా ప్లాన్స్ తీసుకురానున్నామని బిఎస్ఎన్ఎల్ అధికారులు చెబుతున్నారు. 

బిఎస్ఎన్ఎల్ ఫిబ్రవరి 10, 2025 నుండి రూ.201, రూ.797, రూ.2,999 ప్లాన్లను నిలిపివేయనుంది. ఈ ప్లాన్స్ ఇకపై అందుబాటులో ఉండవు. మీరు ఈ రీఛార్జ్ ప్లాన్స్ ఉపయోగిస్తున్నారా? అయితే కొత్త ప్లాన్స్ కోసం ప్రయత్నించండి.

 

34

బిఎస్ఎన్ఎల్ రూ.201 ప్లాన్

90 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ లో 300 నిమిషాల కాల్స్, 6 జిబి డేటా లభిస్తుంది. ఇతర బెనిఫిట్స్ ఏమీ ఉండవు.

బిఎస్ఎన్ఎల్ రూ.797 ప్లాన్

300 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ లో మొదటి 60 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకి 2 జిబి డేటా, 100 SMSలు ఉంటాయి. 60 రోజుల తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు.

44

బిఎస్ఎన్ఎల్ రూ.2,999 ప్లాన్ 

365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ లో రోజుకి 3 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMSలు లభిస్తాయి. ఫిబ్రవరి 10 నుండి ఈ మూడు ప్లాన్లు నిలిపివేస్తున్నారు. ఈ ప్లాన్లను ఉపయోగించుకోవాలనుకుంటే ఫిబ్రవరి 10 లోపు రీఛార్జ్ చేసుకోండి.

 

click me!

Recommended Stories