పొద్దున్నే నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా.. ఈ 5 విషయాల వల్ల మీరు ప్రభావితం కావచ్చు..

First Published | Jun 18, 2024, 7:24 PM IST

ఉదయం నిద్ర లేవగానే చాలా మంది ఫోన్ చెక్ చేసుకోవడం మామూలే. ఈ అలవాటు మన శారీరక, మానసిక ఉల్లాసానికి హాని కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

మీరు నిద్రలేచిన వెంటనే మీ ఫోన్‌ని ఉపయోగించడం మీ స్కిల్స్ ని నిరోధిస్తుంది. సహజమైన పద్ధతి ద్వారా మేల్కొవడానికి బదులుగా  అనవసరంగా మెదడును హై   అలెర్ట్ కు మారుస్తుంది.
 

ఉదయాన్నే ఫోన్ స్క్రీన్  చూడటం వల్ల మీ కళ్ళు  ఫోన్ కాంతికి ఒత్తిడికి గురవుతాయి. దీని వల్ల కళ్ళ నొప్పి, తలనొప్పి,  కళ్ళు పొడి బారడం  ద్వారా మీ సాధారణ కంటి దృష్టి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
 


సోషల్ మీడియా, వార్తలు, ఇమెయిల్‌ల నుండి వచ్చే నోటిఫికేషన్‌లు అకస్మాత్తుగా  ఇంకా ఒత్తిడిని సృష్టించగలవు. వర్క్ నుండి ఉండే నిరంతరం అప్ డేట్స్ మీ మనస్సును రోజంతా ఒత్తిడిలో ఉంచుతాయి.
 

మీరు సోషల్ మీడియాతో  డిస్టర్బ్ అవుతూ మేల్కొంటే, మిగిలిన రోజంతా మీరు డిస్టర్బ్ గా ఉంటారు. ఇది మీ డైలీ  రొటీన్ ని ప్రభావితం చేయడమే కాకుండా మీరు నీరసమైన అనుభూతిని కలిగిస్తుంది. మీ ఫోన్‌ను చూడటం వల్ల మీ పనులపై మీకు ఆసక్తి తగ్గుతుందని,  వాయిదా వేయడానికి దోహదం చేస్తుందని నిపుణులు  అంటున్నారు.

మీ డోపమైన్(Dopamine) బేస్‌లైన్ లేదా మీ మెదడు ఆనందం లేదా సంతృప్తిని పొందాలని ఆశించే డోపమైన్ పరిమాణం, మీరు ఉదయం మీ ఫోన్‌ని మొదట ఉపయోగిస్తే అది పెరుగుతుంది. దీని వల్ల రోజంతా సోషల్ మీడియాలో ఉండే అవకాశం పెరుగుతుంది.
 

Latest Videos

click me!