కాన్ఫెడరేషన్ ఆఫ్ ATM ఇండస్ట్రీ (CADMI) ట్రాన్సక్షన్స్ చార్జెస్ పెంచాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NBCI)లను కోరింది.
ATM CATMI ప్రతి లావాదేవీకి గరిష్ట చార్జీలు రూ. 23కి పెంచాలనుకుంటోంది. ATM కార్డు జారీ చేసే బ్యాంకు అలాగే ఏ ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేయబడిందో ఆ బ్యాంకుకు ట్రాన్సక్షన్ చార్జెస్ చెల్లిస్తుంది.
ప్రతి బ్యాంకు ATM లావాదేవీలకు కొన్ని పరిమితుల ఉంటాయి. కస్టమర్ ప్రతి నెల ఫ్రీ ట్రాన్సక్షన్స్ పరిమితిని మించితే అప్పుడు ప్రతి లావాదేవీలకు ఛార్జీ విధించబడుతుంది. క్యాష్ లేదా నాన్ - క్యాష్ ATM లావాదేవీలకు ఈ చార్జెస్ వర్తిస్తుంది.
ఇప్పుడు ప్రతి నెల ఫ్రీ ట్రాన్సక్షన్స్ ATM లావాదేవీల పరిమితి దాటితే కస్టమర్లు గరిష్టంగా ప్రతి ట్రాన్సక్షన్ చార్జెస్ రూ.21 అయితే దీన్ని రూ.23కి పెంచాలని ఏటీఎం ఇండస్ట్రీ అసోసియేషన్ సిఫార్సు చేసింది.
భారతదేశంలోని ప్రతి బ్యాంకుకు ATM ట్రాన్సక్షన్స్ లిమిట్ మారుతూ ఉంటుంది. అయితే, కొన్ని బ్యాంకుల్లో గరిష్టంగా డైలీ ట్రాన్సక్షన్స్ పరిమితి రూ. 10,000 నుండి ప్రారంభమవుతుంది అలాగే ప్రీమియం కస్టమర్లకు రూ. 50,000 వరకు ఉంటుంది.
బ్యాంకులు ఇప్పుడు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై ఇంకా ఢిల్లీలో ప్రతి నెలా సేవింగ్స్ అకౌంట్ కస్టమర్లకు కనీసం ఐదు ఫ్రీ ట్రాన్సక్షన్స్ అందిస్తున్నాయి. ఇతర బ్యాంకు ATMలో మూడు ట్రాన్సక్షన్స్ ఉచితంగా చేసుకోవచ్చు.