విరాట్ కోహ్లీ కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వెనుక ఉన్నది ఎవరో తెలుసా..?

First Published | Jun 17, 2024, 1:26 PM IST

చిన్నప్పటి నుంచి విరాట్ కోహ్లి సక్సెస్లో  కీలకపాత్ర పోషిస్తున్న అన్నయ్య వికాస్ కోహ్లీ.. వ్యాపార, క్రీడా రంగాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు 112 కోట్ల భారీ బిజినెస్ రన్ చేస్తున్నాడు.
 

ప్రస్తుత క్రికెట్‌ టీంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్  ఉన్న కోహ్లి కేవలం క్రికెటర్ మాత్రమే కాదు.
 

కోహ్లికి దుస్తుల బ్రాండ్ రాంగ్ (wrrogn ), డిజిట్ ఇన్సూరెన్స్, హైపర్‌రైజ్, చిసెల్ ఫిట్‌నెస్, రేజ్ కాఫీ, హోటల్ ఇండస్ట్రీ ఓమ్ ఎయిట్ కమ్యూన్ మొదలైన బిజినెస్లు ఉన్నాయి.  
 


విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988న ఢిల్లీలో ప్రేమ్ కోహ్లీ - సరోజ్ కోహ్లిలకు జన్మించాడు. అతనికి అన్నయ్య వికాస్ కోహ్లి, అక్క భావనా ​​కోహ్లి ఉన్నారు. 
 

కోహ్లీ తండ్రి చనిపోయినప్పుడు విరాట్‌కి 14 ఏళ్లు. దింతో కోహ్లీ అన్నయ్య వికాస్‌ కోహ్లి కుటుంబ ఆర్థిక బాధ్యతలు తీసుకొని కోహ్లీ క్రికెట్  కొనసాగించేలా ప్రోత్సహించాడు.
 

ఈరోజు కోహ్లి అన్నయ్య వికాస్ కోహ్లీ RCB ప్లేయర్‌ కెప్టెన్ కోహ్లీకి ఫ్యామిలీ మెంబర్ మాత్రమే కాదు, అతని బిజినెస్  పార్ట్నర్  కూడా.
 

 మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ విరాక్ కోహ్లీ అత్యంత లాభదాయకమైన వెంచర్‌ను వికాస్ నిర్వహిస్తున్నాడు - అదే One8 బ్రాండ్.
 

 కోహ్లీ విరాట్ అత్యంత విజయవంతమైన వ్యాపారాలలో ఒకటి వన్ 8 కమ్యూన్, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు అండ్  బార్స్  చైన్.
 

ఈ వెంచర్‌ను మొదట స్థాపించినది వికాస్, దీని విలువ ఇప్పుడు 112 కోట్ల రూపాయలు. వికాస్ షాపింగ్ అండ్ రిటైల్ బిజినెస్ వన్8 సెలెక్ట్‌ను కూడా నిర్వహిస్తున్నారు.
 

విరాట్ గౌరవార్థం One8 పేరు పెట్టబడింది, అతని జెర్సీ నంబర్ కూడా 18. బెంగళూరులో ఉన్న One8 కమ్యూన్ రెస్టారెంట్ చైన్ ఈ సంవత్సరం మొత్తం రూ. 112 కోట్ల ఆదాయాన్ని సాధించింది.
 

వికాస్ కోహ్లీ చేతనా కోహ్లిని పెళ్లాడాడు. చేతన ఇన్‌స్టాగ్రామ్ ప్రకారం, వీరు నవంబర్ 23, 2023న  18వ వెడ్డింగ్  అన్నివర్సరీ  జరుపుకున్నారు.
 

విరాట్ కోహ్లీ అన్నయ వికాస్ కోహ్లీ కుటుంబంతో కలిసి గురుగ్రామ్‌లోని విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నారు.
 

Latest Videos

click me!