ఎలాన్ మస్క్ చేసిన పనితో దూసుకెళ్తున్న డోజ్ కాయిన్.. వారంలో 30 శాతం లాభాలు

Published : Apr 05, 2023, 01:01 PM IST

ఎలాన్ మస్క్ ప్రస్తుతం ట్విట్టర్ లోగోను మార్చడం ఓ క్రిప్టో కరెన్సీకి బాగా కలిసి వచ్చింది. ఏకంగా డోజ్ ‌కాయిన్ రేటు గత 7 రోజుల్లో దాదాపు 29.6 శాతం పెరిగింది.

PREV
15
ఎలాన్ మస్క్ చేసిన పనితో దూసుకెళ్తున్న డోజ్ కాయిన్.. వారంలో 30 శాతం లాభాలు

ఎలాన్ మస్క్ పుణ్యమా అని ప్రస్తుతం ప్రముఖ క్రిప్టో కరెన్సీ డోజ్ కాయిన్ దుమ్ము లేపుతోంది ముఖ్యంగా ట్విట్టర్ లోగో  బ్లూ బర్డ్ తీసేసి  డోజ్ కాయిన్  కుక్క బొమ్మను పెట్టినప్పటి నుంచి ఈ క్రిప్టో కరెన్సీ దశతిరిగిపోయింది. దీంతో  Dogecoinలో పెట్టుబడులు  ఉన్న పెట్టుబడిదారులు చాలా లాభపడుతున్నారు. 

25

ఇతర క్రిప్టోల మాదిరిగానే 2022లో డోజ్ కాయిన్ పనితీరు పరిమితంగానే ఉండిపోయింది. కానీ 2023 క్రిప్టో మార్కెట్‌ డోజ్ కాయిన్ కు కలిసి వచ్చింది. తాజాగా ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ తో డోజ్ కాయిన్‌ మరింత ఊపందుకుంది. మస్క్ ట్విట్టర్  వెబ్ లోగోను డోజ్  కాయిన్ కుక్కతో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది Dogecoin రేటుపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది.

35

7 రోజుల్లో 29.6% రాబడిని ఇచ్చింది
Crypto.com ప్రకారం, డోజ్ ‌కాయిన్ రేటు గత 7 రోజుల్లో దాదాపు 29.6 శాతం పెరిగింది. అయితే సోమవారం సాయంత్రం 5.30 గంటల తర్వాత మస్క్ చేసిన ట్వీట్ తర్వాత రియల్ బూమ్ వచ్చింది. అప్పటి నుండి, ఈ క్రిప్టోకరెన్సీ 27 శాతం పెరిగింది. మస్క్ ఇప్పటికే డోజ్ ‌కాయిన్‌కు మద్దతుదారుగా ఉండటం గమనార్హం.
 

45

ట్విట్టర్ లోగో ఎందుకు మార్చారు
ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తర్వాత దాని లోగోను మార్చమని మస్క్‌కి ఓ ట్విట్టర్ యూజర్ సలహా ఇచ్చారు. దీంతో ట్విట్టర్ లోగోను మార్చుతున్నట్లు మస్క్ నిర్ణయం తీసుకున్నారు. లోగో మార్చిన తర్వాత, తను ఆ యూజర్ కు ఇచ్చిన వాగ్దానం పూర్తి చేసినట్లు చెప్పాడు. అంటే, ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తర్వాత, దాని లోగోను మారుస్తానని తన హామీని నెరవేర్చాడు.

55

3 నెలల్లో పనితీరు ఎలా ఉంది
గత 3 నెలల్లోనే, Dogecoin పెట్టుబడిదారులను ధనవంతులను చేస్తూ దాదాపు 32 శాతం రాబడిని ఇచ్చింది. అదే సమయంలో, ఈ క్రిప్టోకరెన్సీ రేటు గత నెలలో 31.5 శాతం పెరిగింది. ప్రస్తుతం, డోజ్ కాయిన్ రేటు రూ.8.21 వద్ద నడుస్తోంది. డోజ్ ‌కాయిన్‌కు సంబంధించి ఒక వ్యక్తి మస్క్‌పై 258 డాలర్లకి దావా వేశారు. ఇందులో మస్క్ డోజ్ ‌కాయిన్‌కు మద్దతుగా పిరమిడ్ స్కీమ్‌ను నడుపుతున్నాడని ఆరోపించారు. మస్క్‌తో పాటు అతని కంపెనీలు టెస్లా  స్పేస్‌ఎక్స్ కూడా ఈ కేసులో చిక్కుకున్నాయి. అతనిపై 9 నెలల క్రితం కేసు నమోదైంది. కేసును కొట్టివేయాలని మస్క్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు పూర్తిగా కల్పితమని ఆయన లాయర్ కోర్టులో చెప్పారు.
 

click me!

Recommended Stories