ఏప్రిల్ నెలలో మీ EMI వాయిదాలు భారీగా పెరిగే చాన్స్...ఎందుకో తెలుసుకోండి...

Published : Mar 31, 2023, 08:33 AM IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును పెంచనుంది. 2023 సంవత్సరానికి గానూ మొదటి రేట్ల పెంపు ఏప్రిల్ మొదటి వారంలో ఉంటుంది. ప్రస్తుత రెపో రేటు 6.5 శాతం. ఆర్బీఐ ఈ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచనున్నట్లు సమాచారం అందుతోంది. 

PREV
14
ఏప్రిల్ నెలలో మీ EMI వాయిదాలు భారీగా పెరిగే చాన్స్...ఎందుకో తెలుసుకోండి...

ఆసియాలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ లో ద్రవ్యోల్బణం సెంట్రల్ బ్యాంక్ సహన పరిమితి 6.00 శాతం కంటే ఎక్కువగా ఉంది, జనవరిలో 6.52 శాతానికి , ఫిబ్రవరిలో 6.44 శాతానికి చేరుకుంది, RBI రెపో రేటును మళ్లీ పెంచడానికి దారితీసింది.

24

ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమావేశం ఏప్రిల్ 3 నుంచి 6 వరకు జరగనుంది. ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్లు పెంచితే, రెపో రేటు ఏడేళ్ల గరిష్ఠ స్థాయి 6.75 శాతానికి చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 

34

2023-24లో ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనా వేసినప్పటికీ, అది నాలుగు శాతానికి పైగా పెరిగే అవకాశం ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లలో అస్థిరత, చమురుయేతర ఉత్పత్తుల ధరలు పెరగడం సంక్షోభాన్ని ప్రేరేపించగలవు. 
 

44

RBIద్రవ్య విధానం దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన విధానాలను రూపొందిస్తోంది, కాబట్టి ద్రవ్య విధాన సమావేశాలు సెంట్రల్ బ్యాంక్ యొక్క అత్యంత ముఖ్యమైన సమావేశాలలో ఒకటి.  ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.9 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. రెపో రేటు అనేది అన్ని వాణిజ్య బ్యాంకులకు RBI చెల్లించే వడ్డీ రేటు. 2020 ప్రారంభంలో కోవిడ్ ప్రపంచాన్ని తాకినప్పుడు, రెపో రేటు 4 శాతం.

click me!

Recommended Stories