ముందస్తు పన్ను చెల్లింపు:
TDS/TCS , MAT మినహాయించిన తర్వాత కూడా, వార్షిక పన్ను బ్యాలెన్స్ రూ.10 వేల కంటే ఎక్కువ ఉన్నవారు నాలుగు వాయిదాలలో ముందస్తు పన్ను చెల్లించాలి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి, పన్ను చెల్లింపుదారులు 15 మార్చి 2023 నాటికి 100% ముందస్తు పన్ను చెల్లించాలి. మీరు ఇంకా ముందస్తు పన్ను చెల్లించకపోతే, మార్చి 31లోగా చెల్లించండి. మార్చి 31లోగా ముందస్తు పన్ను చెల్లించకుంటే అదనపు ఛార్జీ విధించబడుతుంది.