మైక్రోలెండర్ ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్ , గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ వార్‌బర్గ్ పింకస్ మద్దతుతో నవంబర్ 2న IPO సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకోనుంది. ఇన్వెస్టర్లు నవంబర్ 4 వరకు ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయవచ్చు. IPO ప్రైస్ బ్యాండ్ రూ. 350 నుంచి 368కి నిర్ణయించబడింది. మినిమం ఇన్వెస్ట్ మెంట్ రూ.14000 వరకూ పెట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో, రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP) ప్రకారం, యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ నవంబర్ 1న తెరవబడుతుంది. ఈ IPO కింద, 600 కోట్ల రూపాయల విలువైన తాజా ఈక్విటీ షేర్లు జారీ చేయనున్నారు. అదనంగా, 13,695,466 ఈక్విటీ షేర్లు ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద ప్రమోటర్లు విక్రయించనున్నారు.