బ్రిటన్ ప్రధాని రిషి సునక్ భార్య అక్షతా మూర్తి బ్యాక్ గ్రౌండ్, ఆస్తుల విలువ తెలిస్తే దిమ్మ తిరిగాల్సిందే

First Published Oct 26, 2022, 12:33 AM IST

బ్రిటన్‌ కొత్త ప్రధాని రిషి సునక్‌కు భారత దిగ్గజం ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌తో ప్రత్యక్ష సంబంధం ఉంది. రిషి సునక్ భార్య అక్షత ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె, అంతే కాదు ఆమెకు కంపెనీలో వాటాలను కూడా కలిగి ఉంది.

లిజ్ స్ట్రాస్ రాజీనామా తర్వాత, భారత సంతతికి చెందిన రిషి సునక్ బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మంగళవారం కింగ్ చార్లెస్ IIIని కలిశారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాజు ఆయనను కోరారు.  ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరి కళ్ళు పీఎం రిషి సునక్  కుటుంబ నేపథ్యం పైనే ఉన్నాయి.  రిషి సునక్ భార్య అక్షతా మూర్తి మరెవరో కాదు,  భారత్ లో దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె కావడం విశేషం. 

దేశంలోనే అత్యంత సంపన్న ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ లో వ్యవస్థాపకుడి కూతురు అంటే మామూలు విషయమా ఆ కంపెనీలో ఆమెకు వాటాలు కూడా ఉన్నాయి.  వాటి విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌లో అక్షతా తన వాటా కింద 2022లో రూ.126.61 కోట్ల డివిడెండ్‌ రూపంలో ఆదాయం పొందారు అంటే ఆమెకు పూర్తి షేర్ల విలువ ఎంతో తెలిస్తే షాక్ కు గురి అవుతారు.

స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇన్ఫోసిస్ అందించిన సమాచారం ప్రకారం, సెప్టెంబర్ చివరి నాటికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షత 3.89 కోట్లు లేదా 0.93 శాతం ఇన్ఫోసిస్ షేర్లను కలిగి ఉన్నారు. మంగళవారం బిఎస్‌ఇలో ఒక్కో షేరు ధర రూ.1,527.40 చొప్పున ఆమె వాటా విలువ రూ.5,956 కోట్లు. భారతదేశంలో డివిడెండ్ చెల్లించే అత్యుత్తమ కంపెనీలలో ఇన్ఫోసిస్ ఒకటి కావడం విశేషం. 
 

విశేషమేమిటంటే, UK వెలుపల ఆమె ఆదాయంపై పన్ను విధించిన కారణంగా అక్షత వివాదాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ వివాదానికి అక్షత మాత్రమే కాదు, ఆమె భర్త రిషి సునక్‌పై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. .

పన్ను ఎగవేతపై ఆరోపణలు
అక్షతకు ఆమె తండ్రి నారాయణ మూర్తి కంపెనీ ఇన్ఫోసిస్‌లో 0.93 శాతం వాటా ఉంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, అక్షత తన వాటా నుండి దాదాపు రూ. 11.65 కోట్ల వార్షిక డివిడెండ్‌ను పొందుతుంది. ఈ ఆదాయంపైనే అక్షత పన్ను చెల్లించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. 

అక్షత ఓ ఫ్యాషన్ డిజైనర్
అక్షత చాలా కాలంగా యూకేలో ఉంటున్నారు. ఇక్కడ అక్షత డిజైన్స్ పేరుతో కంపెనీని కూడా ప్రారంభించారు. ఇది కాకుండా, ఆమె వెంచర్ క్యాపిటల్ కంపెనీ కాటమరాన్ వెంచర్స్‌కు డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. దీనిని 2010లో అక్షత తండ్రి NR నారాయణ మూర్తి దీన్ని స్థాపించారు.

2002లో అక్షతా మూర్తితో రిషి సునక్ వివాహం
రిషి సునక్ కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్‌లో తన MBA పూర్తి చేశారు. అక్కడే రిషి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని కలుసుకున్నాడు.

2009లో వారిద్దరూ బెంగళూరులో భారతీయ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. అక్షత ఇంగ్లండ్‌లో తన సొంత ఫ్యాషన్ బ్రాండ్‌ను కూడా నడుపుతోంది. ఇప్పటి వరకు, ఆమె ఇంగ్లాండ్‌లోని అత్యంత ధనవంతులలో ఒకరు. సునక్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు- కృష్ణ, అనుష్క.
 

click me!