ప్రస్తుత కాలంలో ఫుడ్ బిజినెస్ కు వచ్చిన డిమాండ్ మరొకటి లేదు. మహా నగరాల నుంచి గ్రామాల వరకు ఫుడ్ బిజినెస్ తిరుగులేని వ్యాపారం. మీరు కూడా ఈ వ్యాపారంలో రాణించాలంటే సరికొత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. క్యాటరింగ్ బిజినెస్ అందుకు మంచి ఉదాహరణ. ప్రస్తుత కాలంలో క్యాటరింగ్ బిజినెస్ చాలా డిమాండ్ అందుకుంటోంది. ముఖ్యంగా గా ఫంక్షన్లు, పెళ్లిళ్లు, పూజలు, బర్త్ డే లు, గెట్ టుగెదర్ పార్టీ లు ఇలా ఒకటి కాదు చాలా సందర్భాల్లో ప్రజలు కలుసుకునేందుకు వేడుకలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో క్యాటరింగ్ సర్వీస్ చక్కటి వ్యాపార అవకాశం అని చెప్పాలి.