UPI Transaction Charges: చక చకా ఫోన్ పే, గూగుల్ పేలో డబ్బులు పంపిస్తున్నారా..అయితే ఇకపై చార్జీలు వేసే చాన్స్.

First Published Aug 19, 2022, 11:55 AM IST

ఫోన్ పే, గూగుల్ పే యాప్ చెల్లింపులకు అలవాటు పడిపోయారా..అయితే మీకు ఆర్బీఐ త్వరలోనే షాక్ ఇవ్వబోతోంది. ఇకపై UPI Transaction లు పరిమితికి మించి వాడితే చార్జీలు విధించేందుకు ఆర్బీఐ సిద్దం అవుతోంది. 

ప్రతీ చిన్న చెల్లింపునకు కూడా.. ఎడా పెడా Google Pay, PhonePeని ఉపయోగిస్తున్నారా? అయితే  ఇక నుంచి డబ్బులు పంపితే చార్జ్ చేసే వీలుంది. RBI ప్రతిపాదించిన ఈ రూల్ అమలులోకి వస్తే  UPI ఆధారిత చెల్లింపు వ్యవస్థ ఫోన్ పే, Google Pay, BHIM వంటి యాప్‌లపై ఛార్జ్ చేస్తారు.

ఆన్‌లైన్ మనీ ట్రాన్స్ ఫర్ గురించి స్మార్ట్ ఫోన్  ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. కిల్లీ కొట్టు నుంచి బంగారం షాపు వరకూ అంతా యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నాం. అయితే ఓ వైపు డిజిటల్ ట్రాన్సాక్షన్లను కేంద్రం ప్రోత్సహిస్తుంటే, మరోవైపు యూపీఐ ఆధారిత ఫండ్ బదిలీలపై చార్జీలు విధించేందుకు ఆర్బీఐ సిద్ధమవుతోంది.
 

దీంతో నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవచ్చని భావిస్తున్నారు.  UPI లావాదేవీలకు ఎలా ఛార్జ్ చేయాలో ఇప్పటికే సూచనలను తీసుకుంటుంది.  ఈ సూచనల ఆధారంగా డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన ఛార్జింగ్ విధానాలపై మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉందని ఆర్‌బీఐ వర్గాలు తెలిపాయి.  ,
 

ఈ రుసుము UPI ఆధారిత క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు, PPIలపై విధిస్తారని భావిస్తున్నారు. UPI ఆధారిత లావాదేవీలే కాకుండా, RTGS, NEFT ద్వారా చెల్లింపులు చేస్తున్నారు.  ప్రస్తుతం కొన్ని ఆర్థిక సంస్థలు IMPS కోసం నిర్ణీత ఛార్జీలను విధిస్తున్నాయి. RBI ప్రచురించిన నివేదికలో, RBI రాబోయే రోజుల్లో ఈ ఛార్జీలను కొనసాగించాలని ప్రతిపాదించింది. ,
 

డెబిట్ కార్డ్ లావాదేవీల కోసం ప్రస్తుతం PSOలు వసూలు చేస్తున్న రుసుములను తగ్గించడానికి బదులుగా, RBI ఫీజులో కొంత భాగాన్ని చెల్లింపు వ్యవస్థ ప్రొవైడర్లకు (PSPs) కేటాయించడాన్ని పరిశీలిస్తోంది. , PSOలలో క్రెడిట్ కార్డ్ వినియోగానికి సంబంధించిన ఛార్జీలను RBI త్వరలో నియంత్రిస్తుంది. దీని కారణంగా, డిజిటల్ చెల్లింపు సేవలను అందించే ఇంటర్మీడియట్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా కొంత ఆదాయాన్ని పొందుతాయి.
 

ఇటీవల ఆర్‌బీఐ డెబిట్ కార్డులకు ఇంటర్‌చేంజ్ ఛార్జీలు విధించింది. దీని కారణంగా డెబిట్ కార్డు వినియోగం కూడా ఖరీదైనది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దీని కోసం ప్రజల నుండి సలహాలను కోరింది. RBI ఈ ప్రతిపాదన అమలు చేయబడితే, ఫోన్ పే, Google Pay, BHIM వంటి యాప్‌ల ద్వారా UPI ఆధారిత చెల్లింపు వ్యవస్థకు చార్జ్ వసూలు చేసే వీలుంది.  

click me!