మీకు ఇంట్లో ఎంత డబ్బు ఉంచుకోవాచ్చో తెలుసా..? ఒకవేళ ఇలా చేస్తే ఎం జరుగుతుందంటే...

First Published | Oct 25, 2023, 10:15 PM IST

మీకు మీ ఇంట్లో ఎంత డబ్బు ఉంచుకోవచ్చు..? నగదు లావాదేవీల పరిమితి ఎంత, పన్ను నిబంధనలు ఏంటో తెలుసా... పన్ను ఎగవేత లేదా నల్లధనం వంటి సమస్యలను/అక్రమాలను నిర్ములించడానికి  దేశంలో డబ్బు నిల్వ,  లావాదేవీలపై కొన్ని నియమాలు ఉన్నాయి. 

సాధారణంగా కొందరికి ఉండే  ప్రశ్న ఏమిటంటే ఇంట్లో ఎంత డబ్బు ఉంచుకోవచ్చు అనేదానికి ఏదైనా పరిమితి ఉందా అని..? దీనిపై సమాచారం మీరు తెలుసుకోవచ్చు. డబ్బును పరిమితిలో ఉంచుకోమని ఏ నియమం మిమ్మల్ని బలవంతం చేయదు. మీకు ఆర్థిక స్థోమత ఉంటే, మీకు కావలసినంత డబ్బును ఇంట్లో ఉంచుకోవచ్చు.
 

గుర్తుంచుకోవలసిన ఏకైక రూల్ ఏమిటంటే, మీరు డబ్బుకి సంబంధించిన అకౌంట్స్/లెక్కలు  తప్పనిసరిగా ఉంచుకోవాలి, మీ ఆదాయానికి మూలం ఏమిటి, ఎక్కడి నుండి వచ్చాయి ఇంకా మీరు పన్ను చెల్లించారా లేదా అని చూసుకోవాలి. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఇంట్లో మీకు కావలసినంత డబ్బు ఉంచుకోవచ్చు. ఏదైనా కారణం చేత మీరు దర్యాప్తు సంస్థకు లేదా ఇన్కమ్ ట్యాక్స్ కి  పట్టుబడితే, మీరు మీ డబ్బుకి సాక్ష్యాలను చూపించాలి లేదా నిరూపించాలి. దీనితో పాటు ఐటీఆర్ డిక్లరేషన్ కూడా చూపించాలి.


ఇలా చేయలేకపోతే, మీపై చర్య తీసుకోవచ్చు. డీమోనిటైజేషన్ అంటే నోట్ల రద్దు తర్వాత మీ ఇంట్లో లెక్కలు/ అకౌంట్స్  లేని డబ్బు కనిపిస్తే మొత్తం రికవరీ చేసిన మొత్తంలో 137% వరకు పన్ను విధించవచ్చని ఆదాయపు పన్ను శాఖ చెబుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నిబంధనల ప్రకారం, ఒకేసారి రూ. 50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్లు లేదా విత్ డ్రా చేసేటప్పుడు మీరు మీ పాన్ కార్డును చూపించాలి.
 

మీరు ఏడాదిలో 20 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే మీరు పాన్ ఇంకా ఆధార్ కార్డును చూపించాలి. అలా చేయని పక్షంలో లక్షల్లో    జరిమానా విధిస్తారు. ఒక సంవత్సరంలో రూ. 1 కోటి కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే 2% TDS చెల్లించాలి. ఒక సంవత్సరంలో  20 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేస్తే చార్జెస్ విధించబడుతుంది. రూ.30 లక్షలకు పైగా నగదు ఆస్తుల కొనుగోలు, విక్రయాలపై విచారణ చేపట్టవచ్చు.
 

ఎలాంటి సాక్ష్యాలు, పెపర్స్ లేకుండా 2 లక్షల కంటే ఎక్కువ డబ్బుతో ఒకేసారి చెల్లించి మీరు ఏది కొనలేరు. మీరు ఇలా  చేయాలనుకుంటే, మీరు ఇక్కడ కూడా పాన్ అండ్ ఆధార్‌ను చూపించాలి. క్రెడిట్-డెబిట్ కార్డ్ ద్వారా ఒకేసారి రూ. 1 లక్షకు పైగా లావాదేవీలపై ఎంక్వయిరీ  చేయవచ్చు. ఒక రోజులో ఇతరుల నుంచి 2 లక్షలకు మించి నగదు తీసుకోవాలంటే  ఈ పని మళ్లీ బ్యాంకు నుంచి జరగాలి. 

Latest Videos

click me!