మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా..! అయితే ఈ ఛార్జీలు ఇక ఉండవు- పూర్తి వివరాలు ఇవిగో!!

First Published | Oct 25, 2023, 12:11 PM IST

దుర్గ నవరాత్రి సందర్భంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త అందించింది. దేశంలోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొన్ని సేవలపై సర్వీస్ ఛార్జీల నుండి  కస్టమర్లను  మినహాయించింది. దీంతో కస్టమర్లకు కాస్త ఊరట లభిస్తుంది. 
 

బ్యాంక్ కరెంట్ ఖాతాదారులకు RTGS, NEFT అండ్ IMPS పై సర్వీస్ ఛార్జీలను మాఫీ చేసింది. అంటే ఇప్పుడు కరెంట్ అకౌంట్ హోల్డర్లు  ఈ మాధ్యమం ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బును ట్రాన్స్ఫర్ చేయడానికి ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.
 

ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ మొబైల్ బ్యాంకింగ్ (PNB వన్) ద్వారా కరెంట్ అకౌంట్ ద్వారా చేసే RTGS, NEFT ఇంకా  IMPS లావాదేవీలకు బ్యాంక్ ఇప్పుడు ఎటువంటి సర్వీస్  ఛార్జీలను వసూలు చేయదు. IMPS పూర్తి పేరు  ఇమ్మిడియట్ పేమెంట్  సర్వీస్. దీని కింద, మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎప్పుడైనా 24x 7 డబ్బును ట్రాన్స్ఫర్  చేయవచ్చు. ఈ సదుపాయంలో ఫండ్స్ వెంటనే బదిలీ చేయబడతాయి. 


దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే NPCI ద్వారా నిర్వహించబడుతుంది. NEFT పూర్తి పేరు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్. 24x7 ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏదైనా ఇతర అకౌంట్ కు డబ్బును బదిలీ చేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు.
 

NEFTలో రియల్  టైం సమయంలో డబ్బు ట్రాన్స్ఫర్ చేయబడదు. దీనికి కొన్ని గంటల సమయం పడుతుంది. ఈ సదుపాయం ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంది. RTGS పూర్తి పేరు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఇందులో  సింగిల్ బటన్ నొక్కడం ద్వారా నగదు బదిలీ జరుగుతుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అలాగే బ్యాంక్ బ్రాంచ్ ద్వారా RTGS పొందవచ్చు.
 

Latest Videos

click me!