నేడు అక్టోబర్ 25న దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 56,700, 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 240 పెంపుతో రూ. 61,840. ఇక వెండి ధర కిలోకు రూ. 75,100.
ముంబై, కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,690 వద్ద ఉంది.
బెంగళూరు, చెన్నైలలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,690గా ఉంది.
ముంబై, కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,550 వద్ద ఉంది.
బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.56,550,
చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.56,750గా ఉంది.
ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.74,600గా ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.78,000 వద్ద ట్రేడవుతోంది.
తెలుగు రాష్ట్రంలోని విశాఖపట్నంలో బంగారం ధరలు ఎగిశాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెంపుతో రూ. 56,700 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 240 పెంపుతో రూ. 61,690. ఇక్కడ వెండి ధర కిలోకు రూ. 78,000.
విజయవాడలో బంగారం ధరలు పెరిగాయి. రేట్ల ప్రకారం చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరుగుదలతో రూ.56,550, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 240 పెంపుతో రూ. 61,690. వెండి విషయానికొస్తే విజయవాడలో వెండి ధర కిలోకు రూ. 78,000.
పెళ్లిళ్ల సీజన్‌కు ముందే బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే డిమాండ్‌ని బట్టి ధరల పెంపు మరింత ఉంటుందో లేదో చూడాలి.
ఆంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1975 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ ధర $22.92 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు డాలర్‌తో పోల్చి చూస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 83.053 వద్ద ఉంది.
గత రెండు వారాల్లో చూస్తే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు పడిపోయి పెరుగుతూ రూ. 60,000 దాటింది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000 అధిగమించింది. అయితే ఇక్కడ పేర్కొన్న బంగారం రేట్లు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, అలాగే ధరలు ప్రతి క్షణం మారవచ్చు. అందువల్ల బంగారం కొనేవారు ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.
0104 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.2 శాతం పెరిగి ఔన్స్‌కు $1,974.29కి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ $1,985.40 వద్ద స్థిరంగా ఉన్నాయి.
స్పాట్ సిల్వర్ 0.3 శాతం పెరిగి ఔన్స్‌కు $23 డాలర్లకు, ప్లాటినం 0.2 శాతం పెరిగి 886.08 డాలర్లకు, పల్లాడియం 0.7 శాతం పెరిగి 1,127.52 డాలర్లకు చేరుకుంది.
ఇక హైదరాబాద్‌లో బంగారం ధరలు మండుతున్నాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెంపుతో రూ. 56,550 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 240 పెరిగి రూ. 61,690. వెండి విషయానికొస్తే, రాజధాని నగరంలో వెండి ధర కిలోకు రూ. 78,000.