ఈ కారణంగా ప్రతి వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉంటాయి. మీ డిపాజిట్‌పై బ్యాంకు ఎప్పటికప్పుడు వడ్డీని కూడా చెల్లిస్తుంది. నిబంధనల ప్రకారం, జీరో బ్యాలెన్స్ అకౌంట్ మినహా అన్ని అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకు జరిమానా విధిస్తుంది.
అయితే మీకు సేవింగ్స్ అకౌంట్లో జమ చేయగల గరిష్ట మొత్తం గురించి తెలుసా...? మీరు మీ సేవింగ్స్ అకౌంట్లో మీకు కావలసినంత డబ్బును ఉంచుకోవచ్చు. దీనికి పరిమితి లేదు. అయితే మీ అకౌంట్లో జమ అయిన మొత్తం పరిమితికి మించి ఉంటే ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది. అప్పుడు సదరు ఆదాయనికి మూలాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఇది కాకుండా, బ్యాంకుకు వెళ్లడం ద్వారా డబ్బును డిపాజిట్ చేయడానికి, విత్‌డ్రా చేసుకోవడానికి ఒక పరిమితి ఉంది. కానీ చెక్కు లేదా ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా మీరు సేవింగ్స్ అకౌంట్లో రూ.1 నుంచి వెయ్యి, లక్షలు, కోట్ల వరకు జమ చేయవచ్చు.
రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే మీ పాన్ నంబర్‌ను తప్పనిసరిగా అందించాలని నిబంధన ఉంది. మీరు ఒక రోజులో రూ.లక్ష వరకు నగదు డిపాజిట్ చేయవచ్చు. అలాగే, మీరు మీ అకౌంట్లో క్రమం తప్పకుండా డబ్బు జమ చేయకపోతే, ఈ పరిమితి రూ. 2.50 లక్షల వరకు ఉండవచ్చు. ఇది కాకుండా ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.10 లక్షల నగదును మీ అకౌంట్లో జమ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే, ఆ బ్యాంకు ఆదాయపు పన్ను శాఖకు నివేదించాలి.
అలాగే, ఆ వ్యక్తి ఈ ఆదాయ మూలాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఇంకా, ఆదాయపు పన్ను రిటర్న్‌లో సమాచారాన్ని అందించలేకపోతే ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రాడార్ కిందకు వస్తుంది. ఒకవేళ పట్టుబడితే భారీ జరిమానాలు విధిస్తారు. ఎవరైనా ఆదాయ వనరులను ప్రకటించకపోతే.. డిపాజిట్ చేసిన మొత్తంపై 60 శాతం పన్ను, 25 శాతం సర్‌ఛార్జ్ ఇంకా 4 శాతం సెస్ చెల్లించాల్సి వస్తుంది.
అయితే, మీరు రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేయలేరు. మీ ఆదాయానికి సంబంధించిన రుజువు ఉంటే చింతించకుండా డబ్బును డిపాజిట్ చేయవచ్చని ఆదాయపు పన్ను నిబంధనలు చెబుతున్నాయి.