కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)తో అన్ని లావాదేవీలను నిలిపివేసింది. ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా అమలులోకి వచ్చింది. అన్ని ప్రభుత్వ శాఖలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజులు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, యూనివర్సిటీలు, ఇతర సంస్థలు తమ ఖాతాలను SBI, PNB లలో రద్దు చేసుకోవాలని ఆదేశాలిచ్చింది కర్ణాటక ప్రభుత్వం.
అలాగే, కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి, కర్ణాటక పరిశ్రమల అభివృద్ధి మండలికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఈ ఆరోపణల ఆధారంగా, ప్రభుత్వ శాఖలు తమ ఖాతాలను SBI, PNB నుంచి రద్దు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త పెట్టుబడులు లేదా డిపాజిట్లు ఈ రెండు బ్యాంకుల్లో చేయవద్దని కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
SBI, PNBతో లావాదేవీలను నిలిపివేయడం ద్వారా కర్ణాటక ప్రభుత్వం నిధులను సురక్షితంగా నిర్వహించవచ్చని యోచిస్తోంది. అయితే, ఈ నిర్ణయం కార్పొరేట్ కార్యకలాపాలు, ప్రభుత్వ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.