జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా కంపెనీలకు పోటీగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ జట్ స్పీడ్ వేగంతో 4జీ సేవలను దేశవ్యాప్తంగా అందించేందుకు పనిచేస్తోంది. ఇప్పటికే దాదాపు 25,000 సైట్‌లను ఇన్‌స్టాల్ చేసింది. ఈ సైట్‌లు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. 2025 జూన్ నాటికి దేశవ్యాప్తంగా లక్ష సైట్‌లను ఇన్‌స్టాల్ చేసే లక్ష్యంగా బీఎస్‌ఎన్‌ఎల్ మెరుపు వేగంతో పనిచేస్తోంది.
bsnl 4g is here
టాటా సంస్థతో చేతులు కలిపిన బీఎస్‌ఎన్‌ఎల్ పోటీ కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియాలకు గట్టి పోటీనిస్తోంది. ఇప్పటికే 40-50 ఎంబీపీఎస్ స్పీడ్ పెంచి 4జీ సేవలు అందించేందుకు కృషి చేస్తోంది.
ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవల కోసం 1,12,000 టవర్‌లను సిద్ధం చేస్తోంది. వీటిలో ఇప్పటికే 9,000 టవర్‌లు ఏర్పాటవ్వగా, 6,000 టవర్లు యాక్టివ్‌లో ఉన్నాయి.
ఈ ఏడాది అక్టోబర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. అతి త్వరలోనే మీ మొబైల్‌లో ఉన్న సిమ్ 4జీగా మారనుందని టెలీ కమ్యూనికేషన్ సంస్థ ఓ ఫోటో విడుదల చేసింది. త్వరలోనే దగ్గరలోని జౌట్‌లెట్‌కు వెళ్లి వినియోగదారులు తమ సిమ్‌ను 4జీ సిమ్‌గా అప్‌గ్రేడ్ చేసుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా 4జీ సేవలు అందుబాటులోకి వచ్చే తేదీ అక్టోబర్ 15 కావచ్చని సమాచారం. ఈ తేదీ ప్రకటన త్వరలోనే బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా వెలవడనుందని తెలుస్తోంది.