House Buy: నెలకు రూ.80 వేల శాలరీతో రూ. 50 లక్షల ఇల్లు కొనడం సాధ్యమేనా.? ఈఎంఐ ఎంత ఉండాలి

Published : Feb 02, 2026, 09:00 AM IST

Smart Financial Planning: నెల జీతం రూ. 80 వేలు ఉన్నవారు 50 లక్షల ఇల్లు కొనుగోలు చేయగలరా? ఈఎంఐ మొత్తం జీతంలో 30 శాతం మించకూడదు. ఆర్థిక ఒత్తిడిని నివారించడానికి ముందే పలు ఆదాయ వనరులను సృష్టించుకోవాలని బిజినెస్ నిపుణులు సూచిస్తున్నారు. 

PREV
15
నెలవారీ రూ. 80 వేలు జీతం..

నెలవారీ 80,000 రూపాయల జీతంతో 50 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కొనుగోలు చేయడం సాధ్యమా అనే అంశంపై బిజినెస్ నిపుణులు ఏం అన్నారంటే..! ఇంటి కొనుగోలుకు సంబంధించి అనేక కీలక అంశాలను పంచుకున్నారు. ఒక వ్యక్తి తన నెలవారీ ఈఎంఐ చెల్లింపులు మొత్తం జీతంలో 30 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు, ఒకవేళ 50 లక్షల ఇంటిని కొనుగోలు చేయడానికి 40 లక్షల రుణం తీసుకుంటే, నెలవారీ ఈఎంఐ 30,000 నుంచి 35,000 రూపాయల వరకు ఉంటుంది. ఈఎంఐ 35,000 రూపాయలు ఉంటే, ఈఎంఐ చెల్లించడానికి కనీసం 1,20,000 రూపాయల జీతం ఉండాలన్నారు. 80,000 రూపాయల జీతంతో ఈ స్థాయిలో రుణం తీసుకోవడం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుందని హెచ్చరించారు.

25
50 లక్షల రూపాయలకు డబుల్ బెడ్‌రూమ్..

ప్రస్తుతం నగరాల్లో 50 లక్షల రూపాయలకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు దొరకడం కష్టమని, ఒక డబుల్ బెడ్‌రూమ్(1200-1300 ఎస్ఎఫ్టీ) సగటున కోటి రూపాయల వరకు ఉంటుందని పేర్కొన్నారు. టైర్-2 నగరాల్లో 50 లక్షలకు దొరికే అవకాశం ఉండవచ్చని తెలిపారు. గృహ రుణాలు సాధారణంగా 25 నుండి 30 సంవత్సరాల పాటు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

35
ఇల్లు కొనుగోలు చేయాలని ప్లాన్..

ఇల్లు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నప్పుడు, ముందుగా ఓ ఆదాయ వనరును సృష్టించుకోవాలన్నారు. ఉదాహరణకు, 50 లక్షల రూపాయలను వడ్డీకి ఇస్తే, నెలకు 50,000 రూపాయల ఆదాయం వస్తుందని, ఇది ఈఎంఐ చెల్లించడానికి గొప్ప భద్రతనిస్తుందని చెప్పారు. జాబ్ కోల్పోయినప్పటికీ, ఈ ఆదాయం ఆర్థిక భద్రతను అందిస్తుందని తెలిపారు. ముందుగా పాసివ్ అసెట్స్‌ను సృష్టించుకోవడం ద్వారా, ఇంటి ఈఎంఐ భారం లేకుండా సౌకర్యవంతంగా కొనుగోలు చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

45
ఇంటి కొనుగోలుకు..

ఇంటి కొనుగోలుకు వయస్సు, కుటుంబ బాధ్యతలు కూడా ముఖ్యమని సూచించారు. 25-30 ఏళ్ల వయస్సులో ఇల్లు కొనడానికి బదులు, ఆ ఈఎంఐ డబ్బును మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర అసెట్ అలొకేషన్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో ఎక్కువ సంపదను సృష్టించుకోవచ్చని తెలిపారు. 45 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు, కుటుంబం స్థిరపడిన తర్వాత ఇంటి కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని పేర్కొన్నారు.

55
అద్దెకు ఉండటంలో..

అద్దెకు ఉండటంలో కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఉదాహరణకు, 10 లక్షల రూపాయలు వడ్డీకి ఇస్తే, నెలకు 20,000 రూపాయలు వస్తుందని, ఈ డబ్బుతో 50 లక్షల ఇంట్లో అద్దెకు ఉండవచ్చని ఉదాహరణగా చెప్పారు. ఇది కొనుగోలుకు అయ్యే భారీ మొత్తాన్ని బ్లాక్ చేయకుండా, ఈఎంఐ ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే, ఇంటి ఈఎంఐ స్థిరంగా ఉంటుంది కాబట్టి 30 సంవత్సరాల పాటు ఒకే మొత్తాన్ని చెల్లించవచ్చని, అద్దెలు మాత్రం ప్రతి సంవత్సరం పెరుగుతాయని పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories