Petrol price pakistan: పాకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలుసా? పాపం అక్కడి ప్రజలు

Published : Mar 25, 2026, 09:17 AM IST

Petrol price pakistan: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఆసియా దేశాల్లో కష్టాలు మొదలయ్యాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత వచ్చేసింది. ఇక పేద దేశంగా మారిన పాకిస్తాన్‌ లో మరీ దారుణంగా మారింది.  అక్కడ ప్రీమియం పెట్రోల్ ధర ఏకంగా 200 శాతం పెరిగింది. 

PREV
13
200 శాతం పెంచేశారు

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గ్యాస్, పెట్రోల్, డీజిల్ కష్టాలు మొదలయ్యాయి. ఇరాన్ దగ్గర ఉన్న హోర్ముజ్ జలసంధి మీదుగా సరుకు రవాణాను ఇరాన్ నిలిపి వేసింది.  దీంతో గ్యాస్, ఆయిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.  దీంతో వీటి ధరలు అంతర్జాతీయంగా పెరిగాయి. భారత్‌లో ప్రీమియం పెట్రోల్ ధరపై  2 రూపాయలు పెంచారు. కానీ పాకిస్తాన్‌లో ఏకంగా 200 శాతం ధర  పెంచడంతో అక్కడి ప్రజలు విలవిల లాడిపోతున్నారు.

23
పాక్ లో లీటర్ పెట్రోల్ ధర ఎంత?

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ పెట్రోల ధరలు పెంచాలని నిర్ణయం తీసుకుంది, పెంచిన ధరలు కొన్ని రోజుల సమయం కూడా ఇవ్వకుండా వెంటనే  అమల్లోకి వచ్చాయి. దీంతో లీటర్ ప్రీమియం పెట్రోల్ ధర 266 రూపాయల నుంచి 321 రూపాయలకు చేరింది. దీంతో సామాన్య ప్రజలకు పెట్రోల్ వాడకం కష్టంగా మారింది.

33
ఇక డీజిల్ ధర ఎంత?

పాకిస్థాన్లో ప్రీమియం డీజిల్ ధర కూడా పెరిగింది. లీడర్ డీజిల్ 335.86కి పెరిగింది. ఇంతకుముందు దీని ధర 280.86 రూపాయలుగా ఉండేది. ఇది లగ్జరీ వాహనాల్లో వాడే హై-ఆక్టేన్ ఇంధనం. కాబట్టి సామాన్యులపై ప్రభావం ఉండదని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.  ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన వెంటనే అంటే మార్చి 6న పాకిస్తాన్ ప్రభుత్వం సాధారణ పెట్రోల్ ధరను కూడా పెంచింది.  లీటర్‌ పెట్రోల్ పై 55 రూపాయలు పెంచేసింది.  పాకిస్తాన్‌లో ఇంధన కొరత, ధరల పెరుగుదల కారణంగా విమాన టికెట్ల ధరలు కూడా పెరిగాయి. ఆ దేశంలో విమానం ప్రయాణాలు చాలా ఖరీదైపోయాయి.

Read more Photos on
click me!

Recommended Stories