Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ ఇస్తోందో తెలుసా?

Published : Oct 05, 2025, 11:40 AM IST

డబ్బు పొదుపు చేయడం ఎంత ముఖ్యమో.. దాన్ని సురక్షితంగా దాచుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే చాలామంది ఫిక్స్ డ్ డిపాజిట్ల వైపు మొగ్గుచూపుతుంటారు. కానీ ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఏ బ్యాంకు ఇస్తోందో తెలుసా? అయితే ఆలస్యమెందుకు తెలుసుకుందాం పదండి.

PREV
16
ఫిక్స్ డ్ డిపాజిట్

వాస్తవానికి డబ్బు దాచుకోవడానికి చాలా మార్గాలుంటాయి. కానీ ఎక్కువమంది ఇష్టపడేది, నమ్మేది, ప్రాధాన్యత ఇచ్చేది మాత్రం బ్యాంకు ఎఫ్ డీలకే. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ రావాలని కోరుకునేవాళ్లు చాలామంది ఫిక్స్ డ్ డిపాజిట్స్ చేస్తుంటారు. ముఖ్యంగా ఆడపిల్లల చదువు, పెళ్లి కోసం డబ్బులు పొదుపు చేసే తల్లిదండ్రులు, గ్రామీణ ప్రాంత ప్రజలు, సీనియర్ సిటిజన్స్.. తమ డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటూ ఉంటారు. అయితే ఏ బ్యాంకు ఎఫ్ డీలపై ఎక్కువ వడ్డీ ఇస్తుందో చాలామందికి తెలియకపోవచ్చు. ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

26
వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే..

కొన్ని బ్యాంకు వెబ్ సైట్ ల డేటా ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు బ్యాంకులు కొంత ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి. ఎవ్వరైనా సరే ఫిక్స్ డ్ డిపాజిట్ చేసేముందు ఏ బ్యాంకు ఎంత వడ్డీ చెల్లిస్తోందో పోల్చుకోవడం మంచిది. దానివల్ల కొంత మొత్తాన్ని నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒక సంత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు ఎఫ్ డీలపై ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తోందో ఇక్కడ చూద్దాం. 

36
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఒక సంవత్సరానికి 6.25 శాతం, మూడు సంవత్సరాలకు 6.30 శాతం, ఐదు సంవత్సరాలకు 6.05 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు 0.5 శాతం వడ్డీని అదనంగా అందిస్తోంది. 

46
HDFC బ్యాంక్

HDFC బ్యాంక్ ప్రస్తుతం సాధారణ కస్టమర్లకు ఒక సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం వడ్డీని అందిస్తోంది. 3 సంత్సరాలకు 6.45శాతం, 5 సంవత్సరాలకు 6.40 శాతం అందిస్తోంది. యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకులు కూడా దాదాపుగా ఇవే వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

56
యూనియన్ బ్యాంక్

యూనియన్ బ్యాంకు సంవత్సరం ఫిక్స్ డ్ డిపాజిట్లపై 6.4 శాతం, 3, 5 సంవత్సరాలకు వరుసగా 6.6%, 6.4 శాతం వడ్డీలను అందిస్తోంది. ఫెడరల్ బ్యాంకు 1,3,5 సంవత్సరాలకు వరుసగా 6.4, 6.5, 6.5 శాతం వడ్డీలను చెల్లిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకులో 6.25, 6.6,  6.6 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి.  

66
బంధన్ బ్యాంకు

బంధన్ బ్యాంకు ఒకటి, మూడు సంవత్సరాల ఎఫ్ డీలపై 7, 5 సంవత్సరాలకు 5.85 శాతం అందిస్తోంది. ఆర్బీఎల్ బ్యాంకు ఒకటి, మూడు, 5 సంవత్సరాలకు వరుసగా 7, 7.2, 6.7 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. డీసీబీ బ్యాంకులో 1, 3, 5,  సంవత్సరాలకు వరుసగా 6.9,  7, 7 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి. 

గమనిక

మరికొన్ని బ్యాంకులు కూడా ఫిక్స్ డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లనే అందిస్తున్నాయి. అయితే ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలి అనుకునేవారు అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లను పరిశీలించి.. నిపుణుల సలహా తీసుకొని ముందుకుసాగడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories