Home Loan: మీ హోమ్‌ లోన్‌ EMI ముగిసిందా.? వెంటనే ఈ పని చేయండి, లేదంటే భారీగా నష్టపోతారు

Published : Feb 19, 2025, 03:23 PM IST

సొంతింటి కల నిజం చేసుకోవాలనేది ప్రతీ ఒక్కరి ఆశ. బ్యాంకులు సులభంగా లోన్స్‌ అందిస్తున్న ప్రస్తుత తరుణంలో పెద్ద ఎత్తున లోన్స్‌ తీసుకుంటున్నారు. అయితే హోమ్‌ లోన్‌ తీసుకున్న వారు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు..   

PREV
14
Home Loan: మీ హోమ్‌ లోన్‌ EMI ముగిసిందా.? వెంటనే ఈ పని చేయండి, లేదంటే భారీగా నష్టపోతారు

ఇంటి స్థలం ఆధారంగా, లోన్‌ తీసుకున్న వ్యక్తి ఆదాయం ఆధారంగా బ్యాంకులు రుణాలు అదింస్తుంటాయి. అదే విధంగా సులభమైన వాయిదాల్లో రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశం కల్పిస్తారు. ఇదిలా ఉంటే హోమ్‌ లోన్‌ ఈఎమ్‌ఐలు ముగిసిన తర్వాత కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది వీటిని మర్చిపోతుంటారు. ఇంతకీ ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

24

నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ (NOC): 

మీ హోమ్‌లోన్‌ ఈఎమ్‌ఐ చెల్లింపులు పూర్తి కాగానే బ్యాంకు నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో బ్యాంకు ప్రతినిధులు మీరు తీసుకున్న లోన్‌ను పూర్తిగా తిరిగి చెల్లించారని, బ్యాంకుకు ఎలాంటి బాకీ లేరన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ సర్టిఫికేట్‌ను అందిస్తారు. లోన్‌ అకౌంట్ క్లోజ చేసినట్లు ఇందులో పేర్కొంటారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. పొరపాటున లోన్‌ అకౌంట్‌లో చిన్న అమౌంట్‌ ఉండి, హోమ్‌లోన్‌ అకౌంట్‌ క్లోజ్‌ చేయకపోతే మీ సిబిల్‌పై ప్రభావం పడుతుంది. 
 

34

లోన్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌: 

లోన్‌ చెల్లించడం పూర్తయిన తర్వాత లోన్‌ అమౌంట్ స్టేట్‌మెంట్‌ను బ్యాంక్‌ నుంచి కచ్చితంగా తీసుకోవాలి. ఇందులో లోన్‌ అమౌంట్‌ జీరో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ స్టేట్‌మెంట్‌లో జీరో చూపిస్తేనే మీ లోన్‌ పూర్తిగా క్లియర్‌ అయినట్లు అర్థం చేసుకోవాలి. పొరపాటున ఏమైనా మిగిలి ఉంటే క్లియర్‌ చేసుకోవచ్చు. 

44

ఒరిజినల్‌ డాక్యుమెంట్స్‌:

ఒక చివరిగా అన్నింటికంటే ముఖ్యమైంది మీ ఇంటి ఒరిజినల్‌ డాక్యుమెంట్స్‌ను తిరిగి తీసుకోవడం. మనలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించి మరిచిపోతుంటారు. లోన్‌ తీసుకునే సమయంలో బ్యాంకులకు ఇచ్చే పవర్‌ ఆఫ్‌ అటార్నీ, సేల్‌ డీడ్‌, లోన్‌ అగ్రిమెంట్ పేపర్స్‌, టైటిల్‌ డీడ్‌ వంటి వాటిని తిరిగి తీసుకోవాలి. ఇక లోన్‌ క్లియర్‌ తర్వాత 30 రోజుల్లోనే బ్యాంకులు మీకు ఈ సర్టిఫికెట్స్‌ అందిస్తుంది. 
 

click me!

Recommended Stories