TVS స్పోర్ట్
రోజూ ఆఫీస్ కి వెళ్లొచ్చే వారికి, మార్కెటింగ్ జాబ్స్ చేసేవారికి TVS స్పోర్ట్ అనువైన బైక్. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.59,881 నుండి ప్రారంభమవుతుంది. 110cc ఇంజిన్ ఉన్న ఈ బైక్ 4 స్పీడ్ గేర్‌బాక్స్ ను కలిగి ఉంది. ఇందులో ఉన్న ET-Fi టెక్నాలజీ ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది.
ఇందులో 10 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంది. ఈ బైక్ లీటరుకు 70-80 కి.మీ మైలేజ్ ఇస్తుంది. తేలికైన బాడీ కావడంతో రైడ్ చాలా సౌకర్యంగా ఉంటుంది.