డీమార్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంట్లోకి కావాల్సిన చాలా రకాల వస్తువులు, సరుకులు డీమార్ట్ లో తక్కువ ధరకు లభిస్తాయి. కాబట్టి చాలామంది డీమార్ట్ లో షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. అయితే డీమార్ట్ ఇటీవల ఆన్ లైన్ సర్వీసులు కూడా ప్రారంభించింది. దీంతో మనం ప్రత్యేకంగా డీమార్ట్ కి వెళ్లి సరుకులు కొనాల్సిన అవసరం లేదు. డీమార్ట్ రెడీ యాప్ ద్వారా మనకు కావాల్సిన వస్తువులను ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. దానివల్ల శ్రమ, సమయం, డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు.