ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు అందించే ఫోర్టిఫైడ్ బియ్యంలో ఎన్నో పోషకాలు ఉంటాయని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. ఈ బియ్యంలో నేచురల్ గా వచ్చే పోషకాలతో పాటు జింక్, విటమిన్ ఎ, థైయమిన్, రెబోఫ్లోమిన్, న్యాసిన్, విటమిన్ బి6 పోషకాలు ప్రత్యేకంగా కలుపుతారు. ఇన్ని పోషకాలున్న బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చు.
ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత సమస్య తగ్గుతుంది. అదేవిధంగా చిన్న పిల్లల్లో రోగనిరోధన శక్తి పెరుగుతుంది. చిన్ననాటి నుంచి ఈ బియ్యం తినడం అలవాటు చేస్తే ఎముకలు బలంగా తయారవుతాయి. పెద్దలకు గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తలెత్తవు.