Car Offers: వారెవ్వా.. దీపావళికి ఈ కారుపై ఏకంగా మూడు లక్షల రూపాయల వరకు డిస్కౌంట్

Published : Oct 18, 2025, 03:08 PM IST

దీపావళి పండుగకు కారు కొనేందుకు సిద్ధమవుతున్నారా? మారుతి, కియా, హోండా, స్కోడా సహా పలు కార్ల కంపెనీలు (Car offers) తమ కార్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. కొన్ని కార్లపై ఏకంగా మూడు లక్షల రూపాయల వరకు తగ్గింపు కనిపిస్తోంది. 

PREV
14
దీపావళికి కార్ కొంటున్నారా?

దీపావళికి కొత్త కారు కొనాలని ఎంతో ప్లాన్ చేసుకుంటారు. ఆరోజు ఏ కారు కొనాలా అని వాకబు చేస్తారు. అలాంటి వారికి శుభవార్త. ఎన్నో కార్ల కంపెనీలు తమ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. కొన్నికార్  మోడళ్లపై అయితే ఏకంగా మూడు లక్షల రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది. మనదేశంలో ప్రముఖ కంపెనీలైన మారుతి, కియా, హోండా, వోక్స్‌వ్యాగన్, స్కోడా వంటి బ్రాండ్లు దీపావళికి భారీ ఆఫర్లను అందిస్తున్నాయి.

24
మారుతి బాలెనో

మారుతి బాలెనో డెల్టా AMT మోడల్‌పై రూ.1.05 లక్షల వరకు ఈ దీపావళికి తగ్గింపు లభిస్తోంది. ఇందులో రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.55,000 విలువైన రీగల్ కిట్ ఉన్నాయి. ఇక మారుతి ఇన్విక్టో ఆల్ఫా మోడల్‌ కారుపై రూ.1.40 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నారు. కియా సోనెట్ మోడల్‌పై రూ.1.03 లక్షల వరకు ఎన్నో ఆఫర్లు ప్రకటించారు.

34
హోండా సిటీ కారు

హోండా సిటీ కారు కొనేవారు కూడా అధికంగానే ఉన్నారు. ఈ కారుపై రూ.1.27 లక్షల వరకు డిస్కౌంట్ దొరుకుతోంది. హోండా ఎలివేట్, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, వోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్లపై రూ.1.5 లక్షల నుంచి రూ.1.8 లక్షల వరకు తగ్గింపు ధరలు ఉన్నాయి. కొన్ని మోడళ్లలో స్క్రాపేజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు, క్యాష్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.

44
స్కోడా కార్ కొనాలంటే

స్కోడా స్లావియా, కుషాక్, మహీంద్రా XUV400, మహీంద్రా మరాజో వంటి మోడళ్లపై రూ.2.5 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ముఖ్యంగా మరాజో కారుపై రూ.3 లక్షల ప్రత్యక్ష క్యాష్ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ దీపావళికి కారు కొనాలనుకునే వారికి ఇది బంపర్ ఆఫర అనే చెప్పాలి. 

Read more Photos on
click me!

Recommended Stories