Fuel Ban డబ్బులిచ్చినా.. ఆ వాహనాలకు పెట్రోల్ పోయరు!! మార్చి నుంచే అమలు..

Published : Mar 02, 2025, 10:13 AM IST

నానాటికీ పెరిగిపోతున్న దిల్లీ నగర కాలుష్యాన్ని ఎలా అరికట్టాలో తెలియక ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. కాలుష్యాన్ని తగ్గించడానికి చాలా చర్యలు చేపడుతున్నాయి. తాజాగా.. 15 ఏళ్లు దాటిన వాహనాలు ఇంధనం పోయవద్దనే నిబంధన అమలు చేసే ప్రయత్నాల్లో పడ్డాయి. 

PREV
14
Fuel Ban డబ్బులిచ్చినా.. ఆ వాహనాలకు పెట్రోల్ పోయరు!! మార్చి నుంచే అమలు..
మార్చి 31 నుంచి నో పెట్రోల్

దిల్లీలో కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఒక కఠిన చర్యకు ఉపక్రమిస్తోంది. 15 ఏళ్లు పైబడిన పాత వాహనాలకు ఇకపై ఇంధనం పోయవద్దని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ విషయాన్ని మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా స్వయంగా మీడియాతో చెప్పారు. మార్చి 31 నుంచి ఈ నిబంధన అమలు కానుంది.

24
దిల్లీ స్మోగ్ గన్స్

కాలుష్య నివారణ తమ ప్రభుత్వం చాలా చర్యలు తీసుకోనుందని సిర్సా చెప్పారు. ప్రభుత్వం పొగ, కాలుష్యాన్ని కంట్రోల్ చేసే మాటలు చెప్పడమే కాదు.. స్ట్రాంగ్ యాక్షన్ కూడా తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

34
15 ఏళ్లు పైబడిన వాహనాలు

15 ఏళ్లు పైబడిన బండ్లను గుర్తు పట్టే గ్యాడ్జెట్లను పెట్రోల్ బంకుల్లో పెడుతున్నాం. వాటి ద్వారా గుర్తు పట్టి పెట్రోల్ పోయమని సిర్సా చెప్పారు. ఈ విషయం పెట్రోలియం శాఖకు కూడా తెలిపారు.

44
ఢిల్లీ పొగ నివారణ చర్యలు

పెట్రోల్ ఇవ్వడం ఆపడమే కాకుండా, దిల్లీలోని ఎత్తైన బిల్డింగులు, హోటల్స్, ఎయిర్‌పోర్ట్, షాపింగ్ మాల్స్‌లో పొగను కంట్రోల్ చేయడానికి స్మోక్ గన్స్ కూడా అమర్చుతామని మంత్రి  వివరించారు. 2025 డిసెంబర్ నాటికి ఢిల్లీలోని సీఎన్‌జీ బస్సులు దాదాపు 90 శాతం తీసేసి, ఎలక్ట్రిక్ బస్సులు పెడతామని మంత్రి చెప్పారు.

click me!

Recommended Stories