బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవల మూడు ప్లాన్స్‌ను తొలగించిన విషయం తెలిసిందే. రూ.201, రూ.797, రూ.2999 వంటి రీఛార్జ్ ప్లాన్‌లను ఫిబ్రవరి 10 అంటే నేటి నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలోనే యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ, అధికంగా ఇంటర్నెట్ డేటా కోరుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.