రాధా కిషన్ దమాని అంటే పెద్దగా తెలియకపోవచ్చు కాని D-Mart ఫౌండర్ అంటే అందరికీ ఈజీగా తెలుస్తుంది. దేశ వ్యాప్తంగా సుమారు 300 పట్టణాల్లో D-Mart మాల్స్ నెలకొల్పి దమాని వ్యాపార వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశారు. ఒక బాల్ బేరింగ్ పరిశ్రమ నిర్వాహకుడు, స్టాక్ మార్కెట్ బ్రోకర్ దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారంటే మామూలు విషయం కాదు. అలాంటి వ్యక్తి ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేయడం వెనుక ఒక విషయం ఉంది.
ధమాని బాల్ బేరింగ్ షాపు నడిపేవారు..
రాధాకిషన్ దమాని ఒక మార్వాడీ కుటుంబంలో జన్మించారు. తండ్రి చిన్న తరహా స్టాక్ బ్రోకింగ్ వ్యాపారం చేస్తుండేవారు. అయితే దమానికి దానిపై ఆసక్తి ఉండేది కాదు. అంతేకాకుండా అతనికి చదువుపైనా ఆసక్తి ఉండేది కాదు. బి.కాం మొదటి సంవత్సరంలో చదువు ఆపేసి చిన్నపాటి బాల్ బేరింగ్స్ వ్యాపారం ప్రారంభించారు. అయితే దమానికి 32 ఏళ్లు ఉండగా అతని తండ్రి అకాల మరణం చెందారు. దీంతో ఆయన జీవితమే మారిపోయింది. తన తండ్రి ప్రారంభించిన స్టాక్ బ్రోకింగ్ వ్యాపారాన్ని దమానీయే కొనసాగించాల్సి వచ్చింది. దీంతో బలవంతంగా ఆయన ఈ ఫీల్డ్ లోకి వచ్చారు. స్టాక్ మార్కెటింగ్ లో కేవలం బ్రోకింగ్ చేస్తే డబ్బు సంపాదించడం కష్టమని ఆయన గ్రహించారు. దీంతో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నారు.
ఆ డబ్బంతా హర్షద్ మెహతా వల్లే వచ్చింది...
రాధాకిషన్ ధమాని సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం హర్షద్ మెహతాదే. అది ఎలా అంటే హర్షద్ మెహతా కొన్ని స్టాక్‌ల ధరలను కృత్రిమంగా పెంచుతూ, కొన్నింటిని తగ్గించేవారు. రాధాకిషన్ దమానీ అటువంటి స్టాక్‌లలో తెలివిగా ఇన్వెస్ట్ చేసేవారు. అలా దమానీ లాభాల్లో ఆనందంగా ఉన్న సమయంలో హర్షద్ మెహతా కుంభకోణం బయటకు వచ్చింది. అయితే అప్పటికి సరిగ్గా వారం రోజుల ముందు హర్షద్ మెహతా షేర్లను రాధాకిషన్ అమ్మేశారు. దీంతో ఆయన లక్కీగా బయటపడ్డారన్న మాట. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ ధమని.. నేను షేర్ల విక్రయాన్ని మరో వారం ఆలస్యం చేసి ఉంటే నేను దివాళా తీసి ఉండేవాడినని అని అన్నారు.
ట్రేడింగ్‌ను విడిచిపెట్టి వ్యాపారం..
హర్షద్ మెహతా హయాంలో షార్టింగ్ స్టాక్స్‌పై ఎక్కువ శ్రద్ధ చూపిన దమాని, తన పోర్ట్‌ఫోలియో కూడా దెబ్బతింటుందని భావించారు. ఈ దశలో అతను చంద్రకాంత్ సంపత్‌ను అనుసరించడం ప్రారంభించారు. ఆయన ఏదైనా స్టాక్‌ను కొనుగోలు చేసేటప్పుడు కనీసం 5 నుండి 10 సంవత్సరాల పాటు దానిని ఉంచాలనుకుంటారు. వారెన్ బఫ్ఫెట్ కూడా ఈ విలువ పెట్టుబడిని ఫాలో అవుతారు. ఇదే విధానాన్నిదమాని పాటిస్తూ స్టాక్ మార్కెట్ ద్వారా కోట్లు సంపాదించారు.
రిటైల్ దిగ్గజం డిమార్ట్ స్థాపన
కొన్నాళ్లు స్టాక్ ట్రేడర్‌గా పనిచేసిన దమాని.. సొంతంగా కంపెనీ ప్రారంభించాలని భావించారు. దీని కోసం 6-7 ఏళ్లుగా మార్కెట్ కు దూరంగా ఉన్నారు. స్టాక్ మార్కెట్ నుంచి తీసుకున్న డబ్బుతో ముంబైలోని పోవాయ్‌లో నవీ తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేశారు. ఈ రోజు దేశంలోని 11 రాష్ట్రాల్లో 300 మార్ట్‌లతో రిటైల్ దిగ్గజంగా డీమార్ట్ అవతరించింది. 2000ల ప్రారంభంలో అప్నా బజార్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన ధమాని, డీ-మార్ట్ ఏర్పాటుకు అవసరమైన విషయాలన్నీ అక్కడే నేర్చుకున్నారు. విక్రేతలతో సంబంధాలను పెంపొందించుకుని 2 సంవత్సరాల తర్వాత ముంబైలో మొదటి D-మార్ట్ స్టోర్‌ను ప్రారంభించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 300 స్టోర్స్ ప్రారంభించి అందరినీ ఆశ్యర్యానికి గురి చేశారు.