ఫ్రీగా ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోండి ఇలా - పూర్తి వివరాలు ఇవిగో

First Published | Sep 12, 2024, 4:23 PM IST

Aadhaar Card Free Update: భారతదేశంలో దాదాపు 140 కోట్ల మంది ఆధార్ కార్డులు కలిగి ఉండగా, 100 కోట్ల మంది మాత్రమే వాటిని అప్డేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సెప్టెంబర్ 14 వరకు ఉచితంగానే ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీకోం 

ఆధార్ కార్డు

చాలా వరకు ప్రభుత్వ ప్రయోజనాలను పొందడం నుండి అనేక ముఖ్యమైన పత్రాలను పొందేందుకు ఆధార్ నంబర్ ప్రాథమిక అవసరంగా మారింది. అందుకే ఆధార్ కార్డు వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 140 కోట్ల 21 లక్షల 68 వేల 849 మంది ఆధార్ కార్డులు పొందారు. ఇందులో 100 కోట్ల 50 లక్షల మంది మాత్రమే తమ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకున్నారు.

ఇంకా దాదాపు 40 కోట్ల మంది ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోలేదు. అందుకే ఆధార్ గుర్తింపు కార్డును అప్‌డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది. దీని కోసం ఉచితంగానే అప్ డేట్ సేవలను ప్రకటించింది. ఇప్పుడు సెప్టెంబర్ 14 వరకు అధార్ వివరాలను ఫ్రీగా అప్ డేట్ చేసుకోవచ్చు. దీంతో ఆధార్ కేంద్రాల వద్ద, ఆన్‌లైన్‌లో ఆధార్‌ను అప్‌డేట్ చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూలో ఉన్నారు. మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో జనం భారీగానే ఆధార్ సెంటర్ల వద్ద కనిపిస్తున్నారు.

ఆధార్ కార్డు

ప్రత్యేకంగా, భారతదేశంలోని ఏ వ్యక్తి అయినా వయస్సు లేదా లింగంతో సంబంధం లేకుండా ఆధార్ నంబర్‌ను పొందేందుకు స్వచ్ఛందంగా నమోదు చేసుకోవచ్చు. నవజాత శిశువుల నుండి ఆధార్ నంబర్ ప్రాథమిక అవసరం. ఒక వ్యక్తి పేరు మీద ఆధార్ నంబర్ సృష్టించబడుతుంది. ఆ నంబర్ ద్వారా ఆ వ్యక్తికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందవచ్చు.

అంటే ఒక వ్యక్తి పేరిట ఒక ఆధార్ మాత్రమే సృష్టించబడుతుంది. అతని కార్డులో ఎన్నిసార్లు వివరాలు మార్చినా నెంబర్ మాత్రం మారదు. ఆధార్ కార్డ్‌లో భారతీయ పౌరుడి పేరు, పుట్టిన తేదీ, లింగం, నివాస చిరునామా, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి వివరాలు ఉంటాయి.
 

Latest Videos


ఆధార్ కార్డు

పదేళ్లకు ఒకసారి ఆధార్‌ నంబర్‌ను  అప్ డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది.  దీని ప్రకారం, మీరు దీన్ని సమీపంలోని ఆధార్ సేవా కేంద్రంలో లేదా ఆన్‌లైన్‌లో https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపింది. 

దాదాపు 40 కోట్ల మంది తమ ఆధార్ నంబర్‌ను ఇంకా అప్‌డేట్ చేసుకోలేదని సమాచారం.  దీన్ని అనుసరించి ఆధార్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి గడువును పొడిగించాలని కోరారు. దీన్ని అంగీకరిస్తూ 3 నెలల్లోగా ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 
 

aadhaar

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రస్తుత ఉచిత అప్ డేట్ గడువు ముగసిన తర్వాత ప్రతి అప్ డేట్ కోసం రూ. 50 వసూలు చేయనుంది. కాబట్టి ఈ సమయంలోనే మీరు ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవడం మంచింది.  UIDAI సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ (CIDR)కి డెమోగ్రాఫిక్ లేదా బయోమెట్రిక్ సమాచారంతో పాటుగా మీ నంబర్‌ను సమర్పించడంతో మీరు అప్ డేట్ చేసుకోవచ్చు. 

ఆధార్ కార్డ్‌ని ఉచితంగా ఎలా అప్‌డేట్ చేసుకోవచ్చు?

1. https://myaadhaar.uidai.gov.in/ ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఆ త‌ర్వాత‌ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, మీకు వెంటనే అందే వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని నమోదుతో లాగిన్ అవ్వండి.
2. లాగిన్ అయిన తర్వాత, మీ ప్రొఫైల్‌లో అందించిన గుర్తింపు, చిరునామా సమాచారాన్ని జాగ్రత్తగా చూడండి. 

3. మీ ప్రొఫైల్‌లో చూపిన వివరాలలో మీరు మార్చాలనుకున్న వివరాలను క్లిక్ చేయాలి. (వివరాలు ఖచ్చితమైనవని మీరు కనుగొంటే, 'పైన ఉన్న వివరాలు సరైనవని నేను ధృవీకరిస్తున్నాను' ట్యాబ్‌ను ఎంచుకోవాలి.)
4. అందించిన డ్రాప్-డౌన్ మెను నుండి, ధృవీకరణ ప్రయోజనాల కోసం మీరు సమర్పించాలనుకుంటున్న నిర్దిష్ట గుర్తింపు పత్రాన్ని ఎంచుకోండి.
5. ధృవీకరణ ప్రక్రియను కొనసాగించడానికి, మీరు మీ గుర్తింపు పత్రం స్పష్టమైన కాపీని అప్‌లోడ్ చేయాలి.  ఫైల్ పరిమాణం 2 MB కంటే తక్కువగా, JPEG, PNG లేదా PDF ఫార్మాట్ లో ఉండాలి.
6. ఇలా మీ అడ్ర‌స్ తో పాటు అన్ లైన్ లో అందుబాటులో ఉన్న వివ‌రాల‌ను మార్చుకోవ‌చ్చు. అయితే, మీ బ‌యోమెట్రిక్ స‌హా ప‌లు వివ‌రాల మార్పుకు మాత్రం ఆధార్ సెంట‌ర్ కు వెళ్లాల్సి ఉంటుంది. 

click me!