క్రిప్టోకరెన్సీ బిల్: భారతదేశంలో క్రిప్టోకరెన్సీని నిషేధిస్తే.. దేశ జనాభాలో వారికి పెద్ద ఎదురుదెబ్బ..

First Published Nov 24, 2021, 11:24 AM IST

మంగళవారం క్రిప్టో బిల్లుకు సంబంధించిన వార్తలు క్రిప్టోకరెన్సీ(cryptocurrency)లలో పెట్టుబడులు పెట్టే భారతీయ పెట్టుబడిదారులలో ఆందోళనను పెంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌(india)లో క్రిప్టోకరెన్సీని నిషేధిస్తే.. అందులో భారీగా పెట్టుబడులు (investments)పెట్టిన వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.

ఒక నివేదిక ప్రకారం, దేశ జనాభాలో దాదాపు ఎనిమిది శాతం మంది వివిధ రకాల డిజిటల్ కరెన్సీ(digital currency)లలో పెట్టుబడి పెడుతున్నారు. 
 
70 వేల కోట్లు 
నివేదిక ప్రకారం, భారతదేశంలో క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టిన వారి సంఖ్య భారతదేశ జనాభాలో 8 శాతం. ఈ పెట్టుబడిదారులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత సమయంలో ఉన్న ఎన్నో రకాల డిజిటల్ కరెన్సీలలో సుమారు 70 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఇలాంటి పరిస్థితిలో భారతదేశంలో క్రిప్టోను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లయితే 70 వేల కోట్ల రూపాయలు పెట్టిన భారతీయ పెట్టుబడిదారులకు తీవ్రమైన పెద్ద దెబ్బ తగులుతుంది. 2009లో ప్రారంభించిన తర్వాత 2013 సంవత్సరం వరకు చలామణిలో ఉన్న ఏకైక డిజిటల్ కరెన్సీ బిట్‌కాయిన్(bitcoin). కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏడు వేలకు పైగా వివిధ క్రిప్టోకరెన్సీలు చెలామణిలో ఉన్నాయి. అయినప్పటికీ, బిట్‌కాయిన్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ కరెన్సీగా మిగిలిపోయింది, దీని తర్వాత ఈథెరియం ఉంది. 
 
క్రిప్టోకరెన్సీ బిల్లు
విశేషమేమిటంటే భారత ప్రభుత్వం శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి క్రిప్టోకరెన్సీ బిల్లు ముసాయిదాను సిద్ధం చేసింది . త్వరలో ప్రభుత్వం క్రిప్టోకరెన్సీలను పూర్తిగా నిషేధించబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ శీతాకాల సమావేశాల్లో మూడు ఆర్డినెన్స్‌లతో సహా 26 కొత్త బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మంగళవారం సాయంత్రం శీతాకాల సమావేశాల కోసం విడుదల చేసిన శాసనసభ ఎజెండా నుంచి ఈ సమాచారం అందింది. ఇందులో ఎక్కువ మంది కళ్లు క్రిప్టోకరెన్సీ బిల్లుపైనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం క్రిప్టోకరెన్సీని పూర్తిగా నిషేధిస్తుందా లేక కొన్ని షరతులతో ట్రేడింగ్‌కు అనుమతిస్తుందా అనేది బిల్లు ఆమోదం పొందిన తర్వాతే తేలనుంది. 

దీంతో అన్ని ప్రధాన డిజిటల్ కరెన్సీలు దాదాపు 15 శాతం మరియు అంతకంటే ఎక్కువ పతనాన్ని చూశాయి, బిట్‌కాయిన్ సుమారు 18.53 శాతం, Ethereum 15.58 శాతం మరియు టెథర్ 18.29 శాతం పడిపోయాయి.

click me!