బాలీవుడ్ స్టార్ హీరోకి బైజుస్‌ షాక్.. యాడ్స్ పై నిషేధం.. కారణం అదేనా..?

Ashok Kumar   | Asianet News
Published : Oct 09, 2021, 02:58 PM IST

క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ పార్టీ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న ఆర్యన్ ఖాన్ తండ్రి  బాలివుడ్ షారుఖ్ ఖాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ దేశంలో అత్యంత విలువైన ఎడ్యుకేషనల్-టెక్నాలజి సంస్థ బైజూస్ కి బ్రాండ్ అంబాసిడర్. 

PREV
16
బాలీవుడ్ స్టార్ హీరోకి   బైజుస్‌ షాక్..  యాడ్స్ పై నిషేధం.. కారణం అదేనా..?

ఇప్పుడు అతని కుమారుడు ఆర్యన్ ఖాన్ జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లిన తర్వాత, షారుఖ్ ఖాన్  అన్ని ప్రకటనలను బైజూస్ నిలిపివేసింది. మీడియా నివేదికల ప్రకారం అడ్వాన్స్ బుకింగ్ ఉన్నప్పటికీ షారుఖ్ ఖాన్‌ ప్రకటనలన్నింటినీ నిలిపివేసింది.
 

26

షారుఖ్ ఖాన్‌ ఇతర కంపెనీలతో ఒప్పందాలు
షారుఖ్ ఖాన్‌ అతిపెద్ద స్పాన్సర్‌షిప్ ఒప్పందాలలో బైజూస్ ఒకటి. బైజూస్ కాకుండా అతను హ్యుందాయ్, ఎల్‌జి, దుబాయ్ టూరిజం, రిలయన్స్ జియో వంటి ఇతర కంపెనీలకు కూడా బ్రాండ్ అంబాసిడర్.
 

36

షారుఖ్ ఖాన్‌కు బైజుస్ ఎంత చెల్లిస్తుంది?
నివేదికల ప్రకారం, బైజుస్ బ్రాండ్‌ను ఆమోదించినందుకు బైజుస్ షారుఖ్ ఖాన్‌కు ఏటా మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు చెల్లిస్తుంది. షారుఖ్ ఖాన్‌ 2017 నుండి ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు.
 

46

సోషల్ మీడియాలో చర్చ 
 ఆర్యన్ ఖాన్  అరెస్టు తరువాత ప్రజలు బైజుస్‌ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. షారుఖ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడం ద్వారా కంపెనీ ఎలాంటి  సందేశాన్ని ఇవ్వాలనుకుంటుందని  ప్రజలు ప్రశ్నించడం  ప్రారంభించారు. షారుఖ్ ఖాన్ తన కొడుకుకి  ఇదే నేర్పిస్తున్నారా అంటూ ద్వాజమెత్తుతున్నారు.. మరోవైపు ఒక ట్విట్టర్ వినియోగదారుడు 'రేవ్ పార్టీ ఎలా చేయాలి..? అనేది బైజుస్‌ ఆన్‌లైన్ క్లాస్‌లో కొత్త సిలబస్ ని జోడించింది అంటూ పోస్ట్ చేశారు.
 

56

 షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ 
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ అతని భార్య గౌరీ ఖాన్ కుమారుడిని పరిస్థితిని చూసి చాలా ఆందోళన చెందుతున్నారు. వీరిద్దరూ కొడుకు కోసం బెయిల్ పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వీరి ప్రయత్నాల తర్వాత కూడా ఆర్యన్ బెయిల్ పొందలేకపోయాడు. 

66

ఆర్యన్ ఖాన్ 3-5 రోజులు క్వారంటైన్ సెల్‌లో  
ఆర్యన్ ఖాన్, ఇతర నిందితులు 3-5 రోజుల పాటు జైల్లోని క్వారంటైన్ సెల్‌లో ఉండాల్సి ఉంటుంది. అయితే కరోనా  వైరుస్ నివేదికలో  వీరికి నెగటివ్ వచ్చింది. కానీ ఈ జైలుకు కొత్త నిందితులు వచ్చినప్పుడల్ల, అతడిని కొన్ని రోజుల పాటు ఈ క్వారంటైన్ సెల్‌లో ఉంచుతారు. కోర్టులోనే విచారణ సమయంలో వైద్య పరీక్షల తర్వాత నిందితులను జైలుకు తీసుకువస్తారు. 

click me!

Recommended Stories