Credit Card: క్రెడిట్ కార్డుతో డ‌బ్బులు విత్‌డ్రా చేస్తున్నారా.? ఏ బ్యాంక్ ఎంత వ‌డ్డీ వ‌సూలు చేస్తుందో తెలుసా.?

Published : Jun 29, 2026, 09:00 AM IST

Credit Card: ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం వేగంగా పెరుగుతోంది.  అయితే అత్యవసర పరిస్థితుల్లో చాలామంది ఏటీఎంల నుంచి నగదు కూడా తీసుకుంటున్నారు. అయితే క్రెడిట్ కార్డుతో కూడా క్యాష్ విత్‌డ్రా చేసుకోవ‌చ్చ‌ని తెలుసా.? 

PREV
15
క్రెడిట్ కార్డుతో ఎంత వరకు నగదు తీసుకోవచ్చు?

ప్రతి క్రెడిట్ కార్డుకు ఒక నగదు ఉపసంహరణ పరిమితి (Cash Limit) ఉంటుంది. ఇది సాధారణంగా మొత్తం క్రెడిట్ లిమిట్‌లో సుమారు 20 శాతం వరకు ఉంటుంది. ఉదాహరణకు, మీ క్రెడిట్ కార్డు పరిమితి రూ.1 లక్ష అయితే, దాదాపు రూ.20 వేల వరకు నగదు తీసుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన క్రెడిట్ పరిమితిని షాపింగ్ లేదా ఇతర డిజిటల్ లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చు. అయితే బ్యాంకును బట్టి ఈ పరిమితి మారే అవకాశం ఉంటుంది.

25
నగదు తీసుకుంటే వెంటనే వర్తించే ఛార్జీలు ఇవే

క్రెడిట్ కార్డు ద్వారా ఏటీఎంలో డబ్బు తీసుకుంటే రెండు రకాల ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయి. క్యాష్ అడ్వాన్స్ ఫీజు (Cash Advance Fee), విత్‌డ్రా చేసిన మొత్తంపై వడ్డీ. ఈ ఛార్జీలు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండవు. సాధారణంగా నగదు తీసుకున్న మొత్తంపై 2 శాతం నుంచి 2.5 శాతం వరకు లేదా మినిమం ఛార్జ్ (రూ.300 లేదా రూ.500)లో ఏది ఎక్కువైతే అది వసూలు చేస్తారు. అంతేకాదు, సాధారణ కొనుగోళ్లకు లభించే క్రెడిట్-ఫ్రీ పీరియడ్ నగదు ఉపసంహరణకు వర్తించదు. డబ్బు తీసుకున్న రోజే వడ్డీ లెక్కింపు ప్రారంభమవుతుంది.

35
ఏ బ్యాంకు ఎంత ఛార్జ్ చేస్తోంది?

బ్యాంకును బట్టి క్రెడిట్ కార్డు ద్వారా నగదు ఉపసంహరణపై వసూలు చేసే ఛార్జీలు, వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి.

* యాక్సిస్ బ్యాంక్ నగదు తీసుకున్న మొత్తంపై 2.5 శాతం లేదా కనీసం రూ.500 క్యాష్ అడ్వాన్స్ ఫీజు వసూలు చేస్తుంది. నెలవారీ వడ్డీ 1.50 శాతం నుంచి 3.60 శాతం వరకు ఉంటుంది.

* బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా 2.5 శాతం లేదా రూ.500 క్యాష్ విత్‌డ్రా ఛార్జీ విధిస్తుంది. వడ్డీ రేటు 1.50 శాతం నుంచి 3.49 శాతం వరకు ఉంటుంది.

* ఇండస్‌ఇండ్ బ్యాంక్లో నగదు ఉపసంహరణపై 2.5 శాతం లేదా రూ.300 (ఏది ఎక్కువైతే అది) వసూలు చేస్తారు. నెలకు 1.79 శాతం నుంచి 3.95 శాతం వరకు వడ్డీ ఉంటుంది.

* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో క్యాష్ తీసుకుంటే 2.5 శాతం లేదా కనీసం రూ.500 ఛార్జీ చెల్లించాలి. వడ్డీ 1.99 శాతం నుంచి 3.60 శాతం వరకు ఉంటుంది.

* హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ కూడా 2.5 శాతం లేదా రూ.500 క్యాష్ అడ్వాన్స్ ఫీజు వసూలు చేస్తుంది. నెలవారీ వడ్డీ 1.99 శాతం నుంచి 3.49 శాతం వరకు ఉంటుంది.

* స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌లో విత్‌డ్రా చేసిన మొత్తంలో 2 శాతం లేదా రూ.300 (ఏది ఎక్కువైతే అది) ఛార్జీగా చెల్లించాలి. వడ్డీ రేటు 1.99 శాతం నుంచి 3.75 శాతం వరకు ఉంటుంది.

* ఐసీఐసీఐ బ్యాంక్ నగదు ఉపసంహరణపై 2.5 శాతం లేదా కనీసం రూ.500 ఛార్జీ విధిస్తుంది. వడ్డీ 2.49 శాతం నుంచి 3.67 శాతం వరకు ఉంటుంది.

* కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రతి రూ.10,000 నగదు ఉపసంహరణకు రూ.300 ఛార్జీ వసూలు చేస్తుంది. వడ్డీ రేటు 2.49 శాతం నుంచి 3.50 శాతం వరకు ఉంటుంది.

* యెస్ బ్యాంక్లో 2.5 శాతం లేదా కనీసం రూ.300 క్యాష్ అడ్వాన్స్ ఫీజు ఉంటుంది. నెలవారీ వడ్డీ 2.49 శాతం నుంచి 3.50 శాతం వరకు ఉంటుంది.

* ఎస్‌బీఐ కార్డ్ ద్వారా నగదు తీసుకుంటే 2.5 శాతం లేదా రూ.500 (ఏది ఎక్కువైతే అది) ఛార్జీ చెల్లించాలి. వడ్డీ రేటు 2.75 శాతం నుంచి 3.50 శాతం వరకు ఉంటుంది.

45
చక్రవడ్డీ ఎలా భారం పెంచుతుంది?

క్రెడిట్ కార్డు ద్వారా నగదు తీసుకున్న తర్వాత వడ్డీని రోజువారీ చక్రవడ్డీ (Daily Compounding Interest) పద్ధతిలో లెక్కిస్తారు. అంటే మీరు బకాయిని చెల్లించడంలో ఎంత ఆలస్యం చేస్తే, వడ్డీపై కూడా మళ్లీ వడ్డీ చేరుతూ మొత్తం చెల్లించాల్సిన మొత్తం వేగంగా పెరుగుతుంది. అందుకే చిన్న మొత్తమే తీసుకున్నా, ఎక్కువ రోజుల పాటు పెండింగ్‌లో ఉంచితే అది పెద్ద ఆర్థిక భారంగా మారే అవకాశం ఉంటుంది.

55
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించడం మంచిది

క్రెడిట్ కార్డు ద్వారా నగదు తీసుకోవడం అత్యవసర అవసరాలకు మాత్రమే పరిమితం చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఈ సౌకర్యాన్ని తరచుగా ఉపయోగించకుండా ఉండాలి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో నగదు తీసుకోవాల్సి వస్తే, వీలైనంత త్వరగా పూర్తి మొత్తాన్ని చెల్లించడం మంచిది. ఇలా చేస్తే అదనపు వడ్డీ భారం తగ్గి, మీ క్రెడిట్ స్కోర్‌పైనా ప్రతికూల ప్రభావం పడకుండా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories