వ్యాపారం మొదలు పెట్టాలని చాలా మంది కోరుకుంటారు. అయితే వీరిలో కొందరు మాత్రమే విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలో రాణించాలంటే కొత్తగా ఆలోచించాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.
సాధారణంగా కొబ్బరి చిప్పలను వేస్టేజ్‌గా భావిస్తుంటాం. కానీ వీటిని సరిగ్గా ఉపయోగించుకోవాలే కానీ వీటితో కూడా భారీగా డబ్బులు సంపాదించవచ్చు. పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఈ వ్యాపారం ప్రారంభించడానికి పెద్ద పెట్టుబడి అవసరం ఉండదు. ఇంతకీ కొబ్బరి చిప్పలతో ఏం చేస్తారు.? ఈ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి.? లాభాలు ఎలా ఉంటాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
25
కొబ్బరి చిప్పలతో ఏం చేస్తారు.?
కొబ్బరి చిప్పలను అనేక వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు. వీటిలో ప్రధానంగా హ్యాండ్‌క్రాఫ్ట్ ఐటమ్స్, పూలపందిరి డెకరేషన్ సామానులు, అగరబత్తి తయారీకి వాడే కొబ్బరి పొడి, యాక్టివేటెడ్ కార్బన్ తయారీ, బౌల్‌లు, కప్పులు, స్పూన్లు (Eco-friendly Tableware) ఈ ప్రోడక్టులకు దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది.
35
ఈ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి?
వ్యాపారం మొదలు పెట్టే ముందు స్థానికంగా లేదా ఆన్‌లైన్‌లో డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై అధ్యయనం చేయాలి. హోటళ్లలో, మిల్లుల్లో, దేవాలయాల వద్ద కొబ్బరి చిప్పలు లభిస్తాయి. మెషినరీ కొనుగోలు కోసం గ్రైండింగ్ యంత్రం, కట్టింగ్ మిషన్లు అవసరమవుతాయి. MSME రిజిస్ట్రేషన్, GST, స్థానిక మున్సిపాలిటీ అనుమతులు తీసుకోవాలి.
కొబ్బరి చిప్పల బిజినెస్‌ను చిన్న స్థాయిలో ప్రారంభించాలంటే. మిషనరీ కోసం రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు అవతుంది. ముడిసరకులు (చిప్పలు) కోసం రూ. 10 వేలు అవుతుంది. ప్యాకేజింగ్ + డెలివరీకి రూ. గరిష్టంగా రూ. 10 వేలు అవుతుంది. ఇలా మొత్తంగా చెప్పాలంటే తక్కువ స్థాయిలో ఈ వ్యాపారం ప్రారంభించాలంటే గరిష్టంగా రూ. 2 లక్షలు అవుతుంది.
55
లాభాలు ఎలా ఉంటాయంటే.?
కొబ్బరి చిప్పలతో తయారు చేసిన వస్తువులకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కొబ్బరి చిప్పల పౌడర్‌ను అమెజాన్, ఇండియామార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా విదేశీ ఆర్డర్లు కూడా పొందవచ్చు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు.