అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ ఈసారి జూలై 12 నుండి 14వ తేదీ వరకు మూడు రోజులపాటు జరగనుంది. ఈ సేల్ సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఆపిల్ (Apple) నుండి ఇటీవల విడుదలైన ఐఫోన్ 16 (iPhone 16) సిరీస్‌పై భారీ తగ్గింపులు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా iPhone 16e, iPhone 16 Pro వేరియంట్లపై అందిస్తున్న డిస్కౌంట్లు మధ్యతరగతి, ప్రీమియం సెగ్మెంట్ వినియోగదారులకు మంచి డీల్స్ గా మారాయి.
2024 సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్ 16 (iPhone 16) సిరీస్‌లో అత్యంత చౌక ధరకు లభించే మోడల్ ఐఫోన్ 16ఈ (iPhone 16e). అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ సందర్భంగా దీని ప్రారంభ ధరను రూ.53,600గా నిర్ణయించారు. అయితే ఎస్బీఐ, ఐసీఐసీఐ కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉపయోగించి కొనుగోలు చేసిన వినియోగదారులకు తక్షణంగా రూ. 4,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీకు ఈ ఫోన్ రూ. 49,600లకే లభిస్తుంది.
ఈ ధరకు వినియోగదారులు Apple Intelligence వంటి కొత్త ఫీచర్లు, ఆధునిక ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్‌ప్లే, యూఎస్బీ టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ వంటి సదుపాయాలతో కూడిన ఫోన్‌ను పొందవచ్చు. ఇది గతంలో వచ్చిన iPhone SE మోడళ్ల కంటే ఆధునికమైన డిజైన్‌ను కలిగి ఉంది.
ఐఫోన్ 16ఈ (iPhone 16e) పై ఇంకా ఎక్కువ తగ్గింపు కోరేవారికి అమెజాన్ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. పాత ఐఫోన్ మంచి కండిషన్‌లో ఉన్నట్లయితే గరిష్ఠంగా రూ.15,000 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ ఎక్స్చేంజ్ విలువ పాత ఫోన్ మోడల్, ప్రస్తుత కండిషన్ పై ఆధారపడి ఉంటుంది.
ఐఫోన్ బిగ్ బ్రాండ్ ఆపిల్ కు చెందినవి. ఐఫోన్ 16ఈ అమెజాన్ ప్రైమ్ సేల్ లో తక్కువ ధరకు లభిస్తోంది. శక్తివంతమైన హార్డ్‌వేర్, కొత్త ఫీచర్లు కలిగిన iPhone కోసం చూస్తున్నవారికి iPhone 16e మంచి ఎంపిక. దీని డిజైన్ పాత iPhone 14 మాదిరిగానే ఉన్నా, ఇది కొత్త A18 చిప్‌తో 8GB ర్యామ్ కలిగి ఉంది.
Apple Intelligence ఫీచర్లను సమర్థవంతంగా డీల్ చేస్తుంది. 48MP ఒక్కటే అయినా.. అది శక్తివంతమైన బ్యాక్ కెమెరాగా కంపెనీ పేర్కొంది. అలాగే, మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. USB-C పోర్టుతో వస్తోంది. మొత్తంగా ఇది బడ్జెట్ ఐఫోన్ వినియోగదారులకు సరైన ఎంపికగా నిలుస్తోంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఇంకా మొదలుకాకముందే, అమెజాన్ ఇప్పటికే iPhone 16 Proపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందిస్తోంది. అసలు ధర రూ.1,19,900గా ఉన్న 128GB వేరియంట్, ప్రస్తుతం రూ. 1,11,900కి అందుబాటులో ఉంది. అంటే ఫోన్ అసలు ధరపై 7 శాతం తగ్గింపును అందిస్తోంది.
అలాగే, ఐసీఐసీఐ, ఎస్బీఐ, కోటక్ బ్యాంకులు, అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై రూ.3,000 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. కనీస ధర రూ. 71,940 ఉన్న అన్ని ఐఫోన్ కోనుగోలు పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.
అంతేకాకుండా, పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే గరిష్ఠంగా రూ.47,150 వరకూ తగ్గింపు లభిస్తుంది. ఉదాహరణకు, మీరు 256GB iPhone 14 Plus ను ఎక్స్చేంజ్ చేస్తే దానిపై రూ.27,600 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లభించవచ్చు. అలా అయితే iPhone 16 Pro ధర కేవలం రూ. 81,300కి తగ్గుతుంది.
iPhone 16 Proలో ఉన్న A18 Pro చిప్, శక్తివంతమైన AI పనితీరు కనబరుస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ (48MP మెయిన్, 48MP అల్ట్రావైడ్, 5x టెలిఫోటో జూమ్) అదిరిపోయింది. గరిష్ఠంగా 27 గంటల వీడియో ప్లేబ్యాక్ సామర్థ్యం దీన్ని ప్రీమియం సెగ్మెంట్‌లో అత్యుత్తమ ఎంపికగా టాప్ లో ఉంచుతోంది.
ఈ ప్రైమ్ డే సేల్‌లో Apple iPhone 16 సిరీస్‌పై అందిస్తున్న తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు చూసి తగిన ప్లాన్‌తో ముందస్తుగా కొనుగోలు చేయడం ఉత్తమమని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రత్యేకించి iPhone 16e మధ్యతరగతి వినియోగదారుల కోసం, iPhone 16 Pro ఫ్లాగ్‌షిప్ ప్రీమియం సెగ్మెంట్ కోసం ఉత్తమ ఎంపికలు అవుతున్నాయి.