అందుకే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం అనేది ఒక చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు ప్రతినెల నిర్ణీత మొత్తంలో ఇందులో డబ్బులు మీరు ఉంచినట్లయితే, చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు 25 సంవత్సరాల వయసులో ఉద్యోగంలో చేరి ప్రతినెల పదివేల రూపాయలు ఇన్వైట్ చేసినట్లయితే మీకు 45 సంవత్సరాలు వచ్చే నాటికి మీ చేతిలో ఒక కోటి రూపాయలు ఉంటాయి అన్న సంగతి మర్చిపోవద్దు. . ఆ వయసులో మీరు ఒక కోటి రూపాయలతో ఇల్లు కొనుగోలు చేసుకోవచ్చు లేదా ఇతర ఆస్తులను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది లేదా మీ పిల్లల ఉన్నత విద్య కూడా ఆ డబ్బు అవసరం పడే వీలుంది.