సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS):
యూనియన్ బడ్జెట్ 2023లో, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) పెట్టుబడి పరిమితిని రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలు పెరిగింది. అంటే సీనియర్ సిటిజన్లు ప్రత్యేక SCSS ఖాతాలను తెరిచి ఒక్కో ఖాతాలో రూ.30 లక్షలు జమ చేయవచ్చు. పెట్టుబడి పెట్టవచ్చు. పెంపు ఏప్రిల్ 1, 2023 నుండి అమల్లోకి వస్తుంది. పదవీ విరమణ తర్వాత సీనియర్ సిటిజన్‌లకు నమ్మకమైన సురక్షితమైన ఆదాయాన్ని అందించే లక్ష్యంతో ఈ ప్రభుత్వ-మద్దతు పథకం 2004లో ప్రారంభించబడింది. జనవరి-మార్చి త్రైమాసికంలో, SCS వడ్డీ రేటు 8%. 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నవారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. కనీసం రూ.1000 నుంచి ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు.పెట్టుబడిదారుడు కోరుకుంటే మరో మూడేళ్లపాటు పొడిగించుకోవచ్చు.