18 ఓటీటీ యాప్‌లు బ్లాక్: వీటిల్లో మీరేమైనా ఉపయోగిస్తున్నారా?

First Published | Dec 22, 2024, 7:18 PM IST

కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాను క్లీన్ చేయడం ప్రారంభించింది. 2021 ఐటీ రూల్స్ ని అతిక్రమించినందుకు గాను 18 ఫేమస్ ఓటీటీ యాప్‌లను బ్లాక్ చేసింది. అందులో మీరు ఉపయోగిస్తున్న ఓటీటీ యాప్ కూడా ఉందేమో ఇక్కడ చెక్ చేసుకోండి. 

ఓటీటీ యాప్ లు బాగా ఫేమస్ అవుతున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో సహా అనేక ఎంటర్‌టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ లో అందుబాటులో ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని చూడడానికి యాక్సిస్ కూడా ఉంటుంది. కొన్ని సినిమాలైతే ఓటీటీల్లోనే రిలీజ్ అవుతాయి. అందువల్ల ఇవన్నీ బెస్ట్ ఎంటర్‌టైన్మెంట్ వేదికలుగా మారిపోయాయి. భారతదేశంలో వందల కొద్దీ ఓటీటీ యాప్‌లు, వెబ్ సైట్లు అనేక రకాల కంపెంట్ లను అందిస్తున్నాయి. 

న్యూస్, ఎంటర్ టైన్మెంట్, బిజినెస్, టూరిజం, కల్చర్, ఇలా ఎన్నో రకాల కంపెంట్లతో ఓటీటీ యాప్ లు, వెబ్ సైట్లు ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్నాయి. అయితే కొన్ని ఓటీటీలు, వెబ్ సైట్లు మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అసత్య విషయాలు ప్రచారం చేస్తూ ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా అశ్లీల కంటెంట్ ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం 2024 డిజిటల్ కంటెంట్ రెగ్యులేషన్ యాక్ట్ కింద కీలక చర్య తీసుకుంది. భారతీయ వినియోగదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 18 ప్రముఖ ఓటీటీ యాప్‌లను బ్లాక్ చేసింది.


ఈ 18 ఓటీటీ యాప్‌లు భారతదేశ ఐటీ నియమాలను ఉల్లంఘించాయి. కంటెంట్ హద్దులు దాటింది. మర్యాదకరమైన కంటెంట్ అందించకుండా అశ్లీల విషయాల ప్రచారానికి వారు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. రూల్స్ ఉల్లంఘించినందుకు 2021 ఐటీ నియమాల ప్రకారం ఈ 18 ఓటీటీ యాప్‌లను బ్లాక్ చేశారు.

18 ఓటీటీ యాప్‌లు అశ్లీల కంటెంట్‌ను అందిస్తున్నాయని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఐటీ చట్టంలోని 69A సెక్షన్ కింద చర్య ఈ యాప్స్ పై చర్యలు తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల పార్లమెంట్ లో జరిగిన సభలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. 

నిషేధించిన 18 యాప్‌లు ఇవే.. డ్రీమ్స్ ఫిల్మ్స్, వూవి, యెస్సమా, అన్‌కట్ అడ్డా, ట్రై ఫ్లిక్స్, ఎక్స్ ప్రైమ్, నియాన్ ఎక్స్ విఐపి, బేషరమ్స్, హంటర్స్, ర్యాబిట్, ఎక్స్‌ట్రీమ్‌మూడ్, న్యూఫ్లిక్స్, మూడ్ ఎక్స్, మోజ్ ఫ్లిక్స్, హాట్ షూట్స్ విఐపి, ఫుగి, చికూఫ్లిక్స్, ప్రైమ్ ప్లే. 

సమాజాన్ని తప్పుదోవ పట్టించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఈ సందర్భంగా అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 

Latest Videos

click me!