డెబిట్ కార్డు లేకుండా ఎటిఎం నుండి డబ్బు ఎలా విత్ డ్రా చేసుకోవచ్చో తెలుసా...?

First Published Apr 5, 2021, 4:53 PM IST

ఎటిఎంల నుండి డబ్బు విత్ డ్రా చేయడానికి డెబిట్ కార్డు అవసరం ఉండదు. ఎందుకంటే త్వరలో మీరు గూగుల్ పే, పేటిఎం వంటి యుపిఐ యాప్స్ ద్వారా కూడా ఎటిఎంల నుండి డబ్బు  విత్ డ్రా చేయవచ్చు. ఎటిఎం తయారీ సంస్థ ఎన్‌సిఆర్ కార్పొరేషన్ యుపిఐ ప్లాట్‌ఫాం ఆధారంగా మొట్టమొదటి ఇంటర్‌పెరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రా (ఐసిసిడబ్ల్యు)ని ప్రవేశపెట్టింది.

ఎటిఎం తయారీ సంస్థ ఎన్‌సిఆర్ కార్పొరేషన్ యుపిఐ ప్లాట్‌ఫాం ఆధారంగా మొట్టమొదటి ఇంటర్‌పెరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రా (ఐసిసిడబ్ల్యు)ని ప్రవేశపెట్టింది.
undefined
దీని ద్వారానే కాకుండా యుపిఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా మీరు ఎటిఎం నుండి డబ్బును ఉపసంహరించుకోవచ్చు. ఈ ప్రత్యేక సౌకర్యం ఉన్న ఏటీఎంను ఏర్పాటు చేయడానికి సిటీ యూనియన్ బ్యాంక్ ఎన్‌సీఆర్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బ్యాంక్ ఇప్పటివరకు 1,500కి పైగా ఎటిఎంలను ఈ సదుపాయంతో అప్‌గ్రేడ్ చేసింది. అంతేకాకుండా చాలా చోట్ల ఈ సదుపాయం కోసం వేగంగా అప్‌గ్రేడ్ పని జరుగుతోంది.
undefined
సిటీ యూనియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ కామ్‌కోడి మాట్లాడుతూ " ఎన్‌సిఆర్ కార్పొరేషన్‌తో మేము భాగస్వామ్యని కుదుర్చుకున్నామని ఐసిసిడబ్ల్యు సొల్యూషన్స్‌కు తెలిపింది. ఇది నెక్స్ట్ జనరేషన్ సొల్యూషన్ మా వినియోగదారులకు అందించడానికి మాకు సహాయపడుతుంది.
undefined
ఇది యుపిఐ క్యూఆర్ కోడ్ ఉపయోగించి మా ఎటిఎంలలో నగదు ఉపసంహరణను అనుమతిస్తుంది. అయితే మొదట్లో ఈ సౌకర్యం ద్వారా మీరు ఏటీఎం నుండి రూ .5 వేలు మాత్రమే ఉపసంహరించుకోగలరు.
undefined
కార్డ్ స్వైపింగ్ అవసరం లేదుసెక్యూరిటి నిపుణులు "ఈ సౌకర్యం వినియోగదారుల భద్రతను పెంచుతుందని, ఎందుకంటే ఇది క్యూ‌ఆర్ కోడ్‌లను కాపీ చేయలేదు. అలాగే క్యాష్ విత్ డ్రా, స్వైప్ కోసం ఏ‌టి‌ఎం కార్డ్ అవసరం లేదు. ఎందుకంటే ఇది ఇప్పటివరకు లేని సురక్షితమైన సౌకర్యం. దీనితో పాటు కార్డును క్లోనింగ్ చేయడం ద్వారా అక్కౌంట్ నుండి డబ్బుల్ ఉపసంహరించుకోవాలనే ఆందోళన కూడా తొలగిపోతుంది.
undefined
ఈ విధంగా ఏ‌టి‌ఎం నుండి ఉపసంహరించుకోవచ్చుఅన్నింటిలో మొదటిది భీమా, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్‌లోని యుపిఐ యాప్‌లలో ఒకదాన్ని మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.తరువాత బ్యాంకు ఖాతాను లింక్ చేయాలి. దీని తరువాత ఎటిఎం స్క్రీన్‌లో కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.స్కానింగ్ పూర్తయిన తర్వాత ఉపసంహరణ మొత్తాన్ని స్మార్ట్‌ఫోన్‌లో ఎంటర్ చేసి, ప్రొసీడ్ బటన్ పై క్లిక్ చేయండి.దీని తరువాత మీరు మీ 4 లేదా 6 అంకెల యుపిఐ పిన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.యుపిఐ పిన్ ఎంటర్ తర్వాత ఎటిఎం నుండి నగదు అందుతుంది.
undefined
click me!