భారతదేశ అత్యంత ధనవంతులు వారి ఖరీదైన ఇంటిని ఎంత ఖర్చు చేసి కొన్నారో తెలుసా...?

First Published Apr 5, 2021, 3:00 PM IST

ప్రముఖ రిటైల్ కంపెనీ డి-మార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని దక్షిణ ముంబైలోని మలబార్ హిల్స్ ప్రాంతంలో 1,001 కోట్ల రూపాయల విలువైన బంగ్లాను కొనుగోలు చేశారు. ఇందుకు 3% స్టాంప్ డ్యూటీ చెల్లించి మార్చి 31న రాధాకిషన్ దమాని  ఇంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.  
 

ఈ ఒకటిన్నర ఎకరాల బంగ్లా కోసం అతను చదరపు అడుగుకు రూ .1.60 లక్షలు చెల్లించాడు. 2020లో 8.8 ఎకరాల భూమిలో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లోని సిసిఐ ప్రాజెక్టుల కింద 500 కోట్ల రూపాయల ఆస్తిని రాధాకిషన్ దమాని కొనుగోలు చేశారు.
undefined
ఫోర్బ్స్ ఇండియా ప్రకారం రాధాకిషన్ దమాని భారతదేశంలో నాల్గవ ధనవంతుడు. అతని నికర విలువ 1.13 లక్షల కోట్లు. ఎప్పుడూ తెల్లని బట్టలు ధరించే దమాని, 1990 లో స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిటైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.
undefined
సైరస్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ సైరస్ పూనవాల 2015లో ముంబైలోని 50 వేల చదరపు అడుగుల లింకన్ హౌస్‌ను 750 కోట్లకు కొనుగోలు చేశారు. అలాగే కుమార్ మంగళం బిర్లా 2015లో మలబార్ హిల్స్‌లోని 25 వేల చదరపు అడుగుల జాటియ ఇంటిని 425 కోట్లకు కొనుగోలు చేశారు.
undefined
2020 డిసెంబర్‌లో భారత్ సీరం & వ్యాక్సిన్‌కు చెందిన గౌతమ్ దఫ్తరీ దక్షిణ ముంబైలోని 20వ అంతస్తులో 6366 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను 101 కోట్లకు కొనుగోలు చేశారు. డిసెంబర్‌లో మోతీలాల్ ఓస్వాల్ కుటుంబం ముంబైలో 101 కోట్లకు అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు.
undefined
undefined
click me!