గ్యాస్ సిలిండర్ ధరలపై శుభవార్త: పేటి‌ఎం ద్వారా లభించే ఈ స్పెషల్ ఆఫర్ గురించి తెలుసుకోండి..

First Published Apr 5, 2021, 1:36 PM IST

గత కొన్ని నెలలుగా దేశంలో ఎల్‌పిజి సిలిండర్ల ధరలు పెరగడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. కానీ ఈ నెలలో ప్రజలకు సిలిండర్ల ధరలపై కొంత ఉపశమనం లభించింది. ఎందుకంటే  ఏప్రిల్ 2021 నుండి ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ దేశీయ ఎల్‌పిజి సిలిండర్ల ధరను రూ .10 తగ్గించింది. 

ఈ తగ్గింపు తర్వాత ఏప్రిల్ 1 నుండి ఢీల్లీలో ఎల్‌పిజి సిలిండర్ ధర 809 రూపాయలు. అంతేకాకుండా ఇప్పుడు పేటి‌ఎం కూడా వినియోగదారులకు గొప్ప ఆఫర్ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు గ్యాస్ సిలిండర్ బుకింగులపై క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
undefined
పేటి‌ఎం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ ద్వారా మీరు గ్యాస్ సిలిండర్లను బుక్ చేస్తే మీకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ పేటి‌ఎం ఆఫర్ 30 ఏప్రిల్ 2021 వరకు ఉంటుంది. అంటే, మీరు ఈ నెల మొత్తం ఈ ఆఫర్ ని సద్వినియోగం చేసుకోవచ్చు.
undefined
ఈ ఆఫర్ మొదటిసారి ఎల్‌పిజి సిలిండర్లను పేటిఎం ద్వారా బుక్ చేసే వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద మీరు సిలిండర్ బుక్ చేసి చెల్లించిన తరువాత మీకు క్యాష్‌బ్యాక్ కలిగిన స్క్రాచ్ కార్డు లభిస్తుంది. అలాగే ఈ ఆఫర్ మొదటి ఎల్‌పి‌జి సిలిండర్ బుకింగ్‌కు చేసేవారికి ఆటోమేటిక్ గా వర్తిస్తుంది. క్యాష్‌బ్యాక్ మొత్తం రూ .10 నుంచి రూ .88 వరకు లభిస్తుంది. మీరు ఈ స్క్రాచ్ కార్డును ఏడు రోజులలోపు ఓపెన్ చేయాలి లేదంటే మీరు దాన్ని ఉపయోగించలేరు.
undefined
మీరు ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకోవాలనుకుంటే మొదట మీరు మీ పేటి‌ఎం యాప్ ఓపెన్ చేసి షో మోర్ పై క్లిక్ చేయండి. అక్కడ రీఛార్జ్ అండ్ పే బిల్స్ క్లిక్ చేయండి. దీని తరువాత మీరు బుక్ సిలిండర్ ఆప్షన్ చూస్తారు. తరువాత మీ గ్యాస్ ప్రొవైడర్‌ను ఎంచుకొండి. వినియోగదారులు బుకింగ్ చేయడానికి ముందు FIRSTLPG ప్రోమో కోడ్‌ను అప్లయి చేయాలి.
undefined
ధరలు నిరంతరం పెరుగుతున్నాయి.ఫిబ్రవరి 2021లో ఎల్‌పిజి సిలిండర్ల ధరలు మూడు సార్లు పెరగడం గమనార్హం. ఫిబ్రవరి 4 న ఎల్‌పిజి ధరను సిలిండర్‌పై రూ .25, తరువాత ఫిబ్రవరి 14న రూ .50, ఫిబ్రవరి 25న మరో రూ .25 పెంచారు. ఇలాంటి పరిస్థితిలో వినియోగదారులు ఈ ఆఫర్ నుండి ఎంతో ప్రయోజనం పొందుతారు.
undefined
click me!