Canva: టెక్ ప్రపంచంలో కలకలం.. వేల మంది ఉద్యోగులను తీసేసినా కాన్వాను ఎందుకు అభినందిస్తున్నారు?

Published : Nov 08, 2026, 11:39 AM IST

Canva Layoffs: డిజైనింగ్ దిగ్గజం కాన్వా భారీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 22 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తోంది. అయితే కంపెనీ ప్రకటించిన భారీ సెవెరెన్స్ ప్యాకేజీ సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.

PREV
15
కాన్వా భారీ షాక్.. వేల మంది ఉద్యోగుల తొలగింపు.. అసలు ఏం జరిగిందంటే?

ప్రపంచ ప్రఖ్యాత డిజైనింగ్ ప్లాట్‌ఫారమ్ కాన్వా (Canva)లో తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కంపెనీ చరిత్రలోనే అత్యంత కష్టకాలంలో భాగంగా భారీ లేఆఫ్స్‌కు తెరతీసింది. సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ మెలానీ పెర్కిన్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సంస్థను పునర్వ్యవస్థీకరించే క్రమంలో ఏకంగా 22 శాతం మంది ఉద్యోగులను, అంటే సుమారు 1,271 మందిని తొలగిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఒకప్పుడు కష్టపడి పైకి వచ్చిన ఈ కంపెనీ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

25
వృద్ధి మందగమనం.. ఏఐ పోటీల ప్రభావం

గత దశాబ్ద కాలంగా ఎంతో వేగంగా వృద్ధి చెందిన కాన్వా ఆదాయం, గత రెండేళ్లుగా మందగించింది. 2024లో 45 శాతం ఉన్న వృద్ధి రేటు, 2025 నాటికి 38 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది ఆగస్టులో రెవెన్యూ అంచనాలను ఏకంగా 20 శాతానికి కుదించుకోవాల్సి వచ్చింది. 20 మిలియన్లకు పైగా ఉచిత వినియోగదారులకు సేవలు అందించే క్రమంలో పెరుగుతున్న ఖర్చులు లాభాలను దెబ్బతీశాయి. దీనికి తోడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్తగా వస్తున్న పోటీ కూడా కాన్వాపై తీవ్ర ప్రభావం చూపింది.

35
సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్న ప్యాకేజీ

సాధారణంగా ఉద్యోగులను తొలగిస్తే కంపెనీలపై తీవ్ర విమర్శలు వస్తుంటాయి. కానీ, కాన్వా మాత్రం ఇందుకు భిన్నంగా తన ఉద్యోగులకు ఇచ్చిన వీడ్కోలు ప్యాకేజీతో అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఉద్యోగం కోల్పోయిన వారికి చట్టబద్ధమైన నిబంధనలకు మించి కనీసం ఆరు నెలల జీతం, ఏడాది పాటు హెల్త్ ఇన్సూరెన్స్, లింక్డ్ఇన్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఇస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగులు తాము వాడిన మ్యాక్ బుక్ ల్యాప్‌టాప్‌లను తమతోటే ఉంచుకోవచ్చని ప్రకటించారు.

45
సరికొత్త కాన్వా కలెక్టివ్ ఫండ్

ఉద్యోగం కోల్పోయిన వారు సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలన్నా లేదా కొత్త ప్రాజెక్ట్ చేపట్టాలన్నా సాయం చేసేందుకు కాన్వా ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా కాన్వా కలెక్టివ్ ఫండ్ ద్వారా అర్హులైన వారికి ఒక్కో ప్రైవేట్ ప్రాజెక్ట్‌కు 10,000 డాలర్ల గ్రాంట్ అందించనున్నట్లు వెల్లడించింది. ఇందులో ఎలాంటి ఈక్విటీని కంపెనీ తీసుకోదు. అలాగే ఉద్యోగులు కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడానికి వీలుగా ప్రత్యేక కెరీర్ సపోర్ట్, రెస్యూమ్ బిల్డింగ్ సాయం కూడా అందిస్తున్నారు.

55
భవిష్యత్తు ప్రణాళికలు..

కంపెనీ నిర్మాణం చాలా సంక్లిష్టంగా మారడంతోనే ఈ మార్పులు చేయాల్సి వచ్చిందని సీఈఓ తెలిపారు. ప్రొడక్ట్, గ్రోత్, ప్లాట్‌ఫాం టీమ్‌లను ఒక్కటి చేసి సిడ్నీ కేంద్రంగా కార్యకలాపాలను బలోపేతం చేయనున్నారు. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుంటూ భవిష్యత్తులో మరింత వేగంగా మెరుగైన ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి తీసుకురావడమే తమ లక్ష్యమని కాన్వా యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొంటూనే కంపెనీని సరైన దారిలో నడిపించేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories