Post Office Scheme: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) అందిస్తున్న గ్రూప్ యాక్సిడెంటల్ గార్డ్ పాలసీ ద్వారా రోజుకు కేవలం రూ.2 చెల్లించి రూ.15 లక్షల వరకు ప్రమాద బీమా పొందవచ్చు. పోస్టాఫీస్ అందిస్తున్న ఈ సూపర్ స్కీమ్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
సామాన్యులకు సైతం ఆర్థిక భద్రత కల్పించేలా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) పలు రకాల బీమా పథకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన 'గ్రూప్ యాక్సిడెంటల్ గార్డ్ పాలసీ' ప్రస్తుతం ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తోంది. రోజువారీ కూలీలు, రైతులు, ఆటో డ్రైవర్లు, వివిధ రంగాల కార్మికులు అందరూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. అత్యంత తక్కువ ప్రీమియంతో భారీ మొత్తంలో ఆర్థిక భరోసా కల్పించడమే ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం.
25
రోజుకు కేవలం రూ.2 ఖర్చుతో రూ.15 లక్షల కవరేజ్
ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి రూ.750 ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.15 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుంది. అంటే రోజువారీ లెక్కన చూస్తే కేవలం రూ.2 మాత్రమే ఖర్చు అవుతుంది. అలాగే రూ.5 లక్షల కవరేజ్ కోసం సంవత్సరానికి రూ.350, రూ.10 లక్షల కవరేజ్ కోసం సంవత్సరానికి రూ.550 చొప్పున వేర్వేరు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయస్సు గల ఎవరైనా ఈ పాలసీని తీసుకోవడానికి అర్హులు.
35
ఏయే ప్రమాదాలు, ప్రయోజనాలు కవర్ అవుతాయి?
ఈ గ్రూప్ యాక్సిడెంటల్ గార్డ్ పాలసీ కింద కేవలం రోడ్డు ప్రమాదాలే కాకుండా అనేక రకాల ఊహించని ప్రమాదాలు కవర్ అవుతాయి. పాము కాటుకు గురికావడం, కరెంట్ షాక్ తగలడం, నిర్మాణంలో ఉన్న భవనాలపై నుంచి కింద పడిపోవడం వంటి అనేక ఆకస్మిక ప్రమాదాలకు ఈ బీమా వర్తిస్తుంది. అంతేకాకుండా యాక్సిడెంటల్ డెత్, శాశ్వత పూర్తి వైకల్యం, శాశ్వత పాక్షిక వైకల్యం వంటి వాటికి పూర్తి బీమా మొత్తం చెల్లిస్తారు.
ఈ పాలసీ కేవలం మరణం లేదా వైకల్యానికే పరిమితం కాకుండా అనేక వైద్య, కుటుంబ ప్రయోజనాలను అందిస్తుంది. ప్రమాదవశాత్తు ఓపీ వైద్య ఖర్చుల కోసం రూ.30,000 వరకు (ప్రతి టెన్సెస్ కు రూ.1500 చొప్పున), యాక్సిడెంటల్ ఇన్-పేషెంట్ కోసం రూ.60,000 వరకు కవరేజ్ లభిస్తుంది. అలాగే కోమాటోస్ బెనిఫిట్ కింద రూ.1,00,000 వరకు, విరిగిన ఎముకల కొరకు రూ.1,00,000 వరకు, కుటుంబ రవాణా ప్రయోజనాల నిమిత్తం రూ.25,000 వరకు అందుతాయి.
55
పిల్లల విద్య, ఇతర సౌకర్యాలు
ఈ పాలసీలో కుటుంబానికి మరింత భద్రత కల్పించే ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. గరిష్ఠంగా ఇద్దరు పిల్లల విద్య కోసం రూ.1,00,000 వరకు విద్యా ప్రయోజనం అందిస్తారు. అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.5,000, న్యూట్రిషనల్ లేదా మానసిక ఆరోగ్యం కోసం 4 కన్సల్టేషన్లు ఉచితం, అన్‍లిమిటెడ్ టెలి కన్సల్టేషన్స్ (ఓపీ) సౌకర్యం కూడా లభిస్తుంది. సులభమైన నమోదు విధానం, క్విక్ క్లైమ్ సెటిల్మెంట్ ద్వారా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఈ సేవలను అందిస్తోంది.