Low Prices: టీవీ, ఏసీ, వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటున్నారా? ఆరోజు తరువాత కొనండి తక్కువ ధరకే వస్తాయి

Published : Sep 04, 2025, 05:07 PM IST

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం పూర్తయింది. ఈ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం అనేక వస్తువులపై జీఎస్టీ తగ్గించేందుకు ఆమోదం లభించింది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త  పన్నులు అమల్లోకి రానున్నాయి. సెప్టెంబరు 22 తరువాత కొన్న వస్తువులు తక్కువ ధరకు లభిస్తాయి. 

PREV
14
తగ్గిపోతున్న జీఎస్టీ పన్నులు

జీఎస్టీ భారంతోనే కొన్నేళ్ల పాటూ  భారత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే  ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పన్ను తగ్గిస్తామని ప్రకటించారు.  ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎన్నో వస్తువులపై జీఎస్టీ పన్ను శాతాన్ని తగ్గించారు. దీని వల్ల  సామాన్యులు, రైతులు, మధ్యతరగతి వారికి సంతోషకరమైన రోజులు మొదలవ్వబోతున్నాయి.

24
ఇక పై రెండే స్లాబులు

నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశం ఢిల్లీలో జరిగింది.  ఇప్పటి వరకు 5 శాతం, 12 శాతం, 18శాతం,  28శాతం జీఎస్టీ స్లాబులగా ఉంది.  ఇందులో 12 శాతం,  28శాతం స్లాబ్‌లను తొలగించి 5%, 18% స్లాబ్‌లను మాత్రమే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 

34
ఇవన్నీ తక్కువ ధరకే

జీఎస్టీ పన్నులను కుదించడం వల్ల ఎన్నో ఆహార వస్తువుల ధరలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆహార ధాన్యాలు, పాలు, మందులు, విద్యా సామాగ్రిపై  పూర్తిగా జీఎస్టీని తొలగించారు. మందులు 5 శాతం పన్ను, పండ్లు, కూరగాయలు, టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ, చిన్న కార్లు, బ్రాండెడ్ దుస్తుల ఖరీదు వెయ్యి రూపాయలు దాటితే 5 శాతం పన్ను పడుతుంది. ఇక  చెప్పుల ధర వెయ్యి రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఉంటే 5% జీఎస్టీ పడుతుంది. పాస్తా, నూడుల్స్, మాకరోనీ వంటి వాటిపై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గింది.

44
టీవీలు వాషింగ్ మెషీన్లు

ఏసీలు , 32 ఇంచ్ కన్నా పెద్దవైన టీవీలు, వాషింగ్ మెషిన్లు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లపూ భారీగా ధరలు తగ్గవచ్చు. వీటి జీఎస్టీ 18 శాతానికి తగ్గించారు. దీని వల్ల గతం కన్నా ధరలు తగ్గుతాయి. అలాగే  సిమెంట్, ఐస్ క్రీం, జ్యూస్, ప్యాక్ చేసిన ఆహారం, వస్త్రాలు వంటి వాటిపై కూడా 18 శాతం జీఎస్టీ పన్నును నిర్ణయించారు.

అలాగే  బైక్‌లు, ఆటోలు, లారీలపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. సెప్టెంబర్ 22 నుంచి కొత్త రేట్లు అమలులోకి రాబోతున్నాయి. మీరు ఈ వస్తువులైనా కొనాలనుకుంటే సెప్టెంబరు 22 తరువాత కొనడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories