ఈ ఎలక్ట్రిక్ బైక్ కొంటే 5 ఇయర్స్ వారంటీతో పాటు ఐఫోన్ మీ సొంతం

First Published | Sep 26, 2024, 7:49 PM IST

ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల జోరు పెరిగింది. ఇంతకు ముందు వీటి ధరలు చాలా ఎక్కువగా ఉండేవి. అందుకే అందరూ పెట్రోల్ వాహనాలు కొనేవారు. ఇప్పుడు పెట్రోల్ వాహనాలతో సమానంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు తగ్గిపోయాయి. కొన్ని వాటికంటే తక్కువ ధరకే లభిస్తున్నాయి. దసరాను పురస్కరించుకొని చాలా కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నాయి. ఇండియాలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ఒకటి సూపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ కంపెనీ తయారు చేసిన బైక్ కొంటే అయిదేళ్లు వారంటీతో పాటు ఐఫోన్ గెలిచే ఛాన్స్ ఇస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 

ప్రపంచం చాలా వేగంగా మార్పుచెందుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాల మార్కెట్ కు మరో పదేళ్ల పాటు ఎటువంటి ఇబ్బంది ఉండదని విశ్లేషకులు రెండేళ్ల క్రితం అంచనా వేశారు. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు చూస్తుంటే మరో అయిదేళ్లలో పెట్రోల్, డీజిల్ వెహికల్స్ రోడ్లపై కనిపించవని అనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న కంపెనీలతో పాటు కొత్త కొత్త కంపెనీలు కూడా బెస్ట్ ఫీచర్స్ తో బైక్స్, స్కూటర్స్ తయారు చేస్తున్నాయి. 
 

ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే ఒబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ తాజాగా ఒక అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది. ఎలక్ట్రిక్ బైకులపై మంచి డిస్కౌంట్‌తోపాటుగా బహుమతులు గెలిచే ఛాన్స్ ఇస్తోంది. ఈ ఆఫర్లు సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 12 వరకు వర్తిస్తాయని ప్రకటించింది. 

స్టన్నింగ్ లుక్ తో అదరగొడుతున్న ఒబెన్ రోర్(Oben Rorr) ధర కేవలం రూ. 1,49,999 లక్షలు.  అయితే ప్రత్యేక ఆఫర్ గా రూ.1,19,999(ఎక్స్-షోరూమ్)లకు కొనుగోలు చేయడానికి ఛాన్స్ అందిస్తోంది. దీన్ని కొంటే 5 సంవత్సరాల వారంటీ ఇస్తోంది. అంతే కాకుండా ఐఫోన్ 15, ఐపాడ్ మినీ, సోనీ హెడ్‌ఫోన్‌లను గెలుచుకునే అవకాశం ఉంటుందని కంపెనీ ప్రకటించింది. 
 


ఒబెన్ రోర్ అసలు ధర రూ.1,49,999 (ఎక్స్-షోరూమ్). అయితే ధర తగ్గించడంతో రూ. 30,000 ఆదా అవుతుంది. దీంతో పాటు మెుత్తం రూ.60 వేల వరకు ప్రత్యేక ఫీచర్స్ పొందవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. బెంగుళూరు ప్రధాన కేంద్రమైన ఈ కంపెనీ దిల్లీ, పూనెలోని తమ షోరూమ్‌లలో ప్రత్యేకంగా దసరా ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 29న బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ షోరూమ్‌లో, అక్టోబర్ 2న ఢిల్లీలోని ద్వారకా షోరూమ్‌లో, అక్టోబర్ 6న పూనెలోని వాకాడ్ షోరూమ్‌లో ఈ ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఒబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ విస్తరణలో భాగంగా ఈ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. 
 

Oben Rorr ఫీచర్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. దీని టాప్ స్పీడ్ 100 km/hour. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 187 కి.మీ. వరకు ప్రయాణం చేయొచ్చు. ఇది కేవలం రెండు గంటల్లోనే పూర్తి ఛార్జింగ్ ఎక్కుతుంది. అంతేకాకుండా మూడు సెకన్లలో 40 కి.మీ. స్పీడ్ అందుకుంటుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 4.4 kWh.ఇంజిన్ పవర్ వచ్చేసి 8 kW.అందువల్ల వేగంగా స్పీడ్ అందుకుంటుంది. దీని Neo-classic లుక్ చూసేవారికి కట్టిపడేస్తుంది. ఎర్గో డిజైన్ ఇంజిన్ తో స్ట్రాంగ్ ఏఆర్ఎఫ్ ఫ్రేమ్ ను కలిగిఉంది. జీపీఎస్ సిస్టం, రిమోట్ డయాగ్నోస్టిక్స్, థెఫ్ట్ ప్రొటెక్షన్ తదితర ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.  

Latest Videos

click me!