అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్: సోనీ, ఎల్జీ వంటి టాప్ టీవీలపై 65 % వరకు తగ్గింపు

First Published | Sep 26, 2024, 5:14 PM IST

65% off on branded TVs - Amazon Sale:  అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 సెప్టెంబర్ 27న ప్రారంభం కానుంది. అయితే, ఒక రోజు ముందుగానే ప్రైమ్ మెంబ‌ర్ల‌కు ఈ సేల్ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఎల్జీ, సోనీ సహా బ్రాండెడ్ టీవీల‌పై 65 శాతం వ‌ర‌కు త‌గ్గింపులు అందిస్తోంది. 
 

tv, smart tv,

Amazon Great Indian Festival Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అద్భుత‌మైన ఆఫ‌ర్లతో ముందుకు వచ్చింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 సెప్టెంబర్ 27న ప్రారంభం కానుంది. అయితే, ఒక రోజు ముందుగానే ప్రైమ్ మెంబ‌ర్ల‌కు ఈ సేల్ అందుబాటులోకి వ‌చ్చింది.  అంటే ప్రైమ్ యూజ‌ర్ల‌కు ఈ సేల్ ఇప్ప‌టికే అందుబాటులోకి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఎల్జీ, సోనీ సహా బ్రాండెడ్ టీవీల‌పై 65 శాతం వ‌ర‌కు త‌గ్గింపులు అందిస్తోంది. దీంతో పాటు మీరు ఎక్సేంజ్ పై కూడా ఈ  సూప‌ర్ స్మార్ట్ టీవీల‌ను త‌క్కువ ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

సోనీ, ఎల్జీ, సామ్ సాంగ్, Acer వంటి ప్రముఖ బ్రాండ్‌లపై 65% వరకు తగ్గింపుతో ఆకట్టుకునే డీల్‌లను తీసుకువ‌చ్చింది అమెజాన్.  షాపర్‌లు ఎక్స్‌ఛేంజ్ డీల్‌లు, నో-కాస్ట్ EMI ఎంపికలతో సహా అద్భుతమైన ఆఫర్‌లను ఆస్వాదించవచ్చు. మీ బడ్జెట్‌కు ఇబ్బంది లేకుండా షాపింగ్ చేయడం మ‌రింత సుల‌భంగా మార్చింది.

ఈ సేల్ లో విభిన్న అవసరాలు, బడ్జెట్‌లకు అనుగుణంగా అనేక స్మార్ట్ టీవీల‌ను తీసుకువ‌చ్చారు. లేటెస్ట్ హైటెక్ మోడల్స్ నుంచి మరింత తక్కువ ధరలో టీవీలు అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీల‌పై ఒక్క‌సారి లుక్కేయండి మ‌రి.. ! 

1. సోనీ 139 సెం.మీ (55 అంగుళాలు) BRAVIA K-55S25B

ఈ 4K అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ ఈడీ టీవీ దాని క్రిస్టల్-క్లియర్ విజువల్స్, స్మూత్ మోషన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. అలాగే, అధునాతన 4K ప్రాసెసర్ X1, MotionFlow XR 100 టెక్నాలజీతో వ‌స్తోంది. 20 వాట్స్ డాల్బీ ఆడియో స్పీకర్లు అద్భుత‌మైన సౌండ్ అనుభవాన్ని అందిస్తాయి. Google TV, Chromecast, Apple AirPlay వంటి స్మార్ట్ ఫీచర్‌లు కూడా ఉన్నాయి. 

రిజల్యూషన్: 4K అల్ట్రా HD (3840 x 2160)

రిఫ్రెష్ రేట్: 60 Hz

కనెక్టివిటీ: 3 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు

వారంటీ: 2 సంవత్సరాలు


2. ఎల్జీ (LG) UR7500P (55 అంగుళాల 4K LED TV)

AI-ఆధారిత పిక్చ‌ర్ క్వాలిటీతో మార్కెట్ లోకి వ‌చ్చిన ఈ మోడల్ సినీ ప్రేమికులకు, గేమర్‌లకు ఒక సూప‌ర్ ఎంపిక అని చెప్పాలి. AI అకౌస్టిక్ ట్యూనింగ్, బ్లూటూత్ సరౌండ్ రెడీ ఫీచర్‌లు అద్భుత‌మైన ఆడియోను అందిస్తాయి. యూజర్ ఫ్రెండ్లీ WebOS ఇంటర్‌ఫేస్ మీకు ఇష్టమైన స్ట్రీమింగ్ యాప్‌ల ద్వారా సులభంగా నావిగేషన్ ను అందిస్తుంది. 

రిజల్యూషన్: 4K అల్ట్రా HD (3840 x 2160)

రిఫ్రెష్ రేట్: 60 Hz

కనెక్టివిటీ: Wi-Fi, 3 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు

వారంటీ: 1 సంవత్సరం

3. సామ్ సంగ్ (Samsung) D సిరీస్ 55" 4K TV

అద్భుతమైన విజువల్ క్లారిటీకి ప్రసిద్ధి ఈ సామ్ సంగ్ టీవీలో క్రిస్టల్ ప్రాసెసర్ 4కే, హెచ్‌డిఆర్ సపోర్ట్, మోషన్ ఎక్స్‌లరేటర్‌ల‌తో వ‌స్తోంది. Bixby, SmartThings హబ్ వంటి స్మార్ట్ ఫంక్షనాలిటీలతో ఇది మీ కుటుంబానికి స‌రైన ఎంపిక కావ‌చ్చు. 

రిజల్యూషన్: 4K అల్ట్రా HD (3840 x 2160)

రిఫ్రెష్ రేట్: 50 Hz

కనెక్టివిటీ: 3 HDMI పోర్ట్‌లు, 1 USB పోర్ట్

వారంటీ: ప్యానెల్‌పై 1 సంవత్సరం ప్ర‌స్తుత ఆఫ‌ర్ తో మ‌రో 1 సంవత్సరం కూడా.

Xiaomi Smart TV A

4. Xiaomi 108 cm (43 అంగుళాలు) A Pro 4K

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ టీవీ ఇది. ఇందులో ప్ర‌స్తుతం ఇతర స్మార్ట్ టీవీల్లో ఉంటే అన్ని ఫీచ‌ర్లు ఉన్నాయి. అద్భుతమైన పిక్చ‌ర్ క్వాలిటీతో డాల్బీ విజన్, HDR10కి స‌పోర్టు చేస్తుంది. 30W డాల్బీ ఆడియో స్పీకర్లు రిచ్ సౌండ్‌ని అందిస్తాయి. 

రిజల్యూషన్: 4K అల్ట్రా HD (3840 x 2160)

రిఫ్రెష్ రేట్: 60 Hz

వారంటీ: ఉత్పత్తిపై 1 సంవత్సరం, ప్యానెల్‌పై 1 సంవత్సరం

5. ఏసర్ సూపర్ సిరీస్ (55 అంగుళాల అల్ట్రా HD స్మార్ట్ QLED)

డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ స‌పోర్టుతో అల్ట్రా-క్యూఎల్‌ఇడి డిస్‌ప్లేను కలిగి ఉండే ఈ మోడల్ చిన్న ప్రదేశాలకు అనువైనది. MEMC, సూపర్ బ్రైట్‌నెస్ వంటి సాంకేతికతలతో బిగ్ బ్రాండ్ ల‌కు సైతం పోటీనిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ప్లాట్‌ఫారమ్ తో న‌డిచే Google TV ఇది. 

రిజల్యూషన్: అల్ట్రా HD స్మార్ట్ QLED (3840 x 2160)

రిఫ్రెష్ రేట్: 120 Hz

వారంటీ: 1 సంవత్సరం

Latest Videos

click me!