ఇప్పుడు ఈ మగ్గం వర్క్ ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాం. మగ్గం వర్క్ అనేది ఉత్తరాది భారత దేశానికి చెందినది. ముఖ్యంగా లక్నో, కాన్పూర్, బరేలీ, ఆగ్రా ప్రాంతాల్లో ఈ మగ్గం వర్క్ చాలా ఫేమస్. ఆ ప్రాంతంలో పెళ్ళికూతురు వేసుకునే గాగ్రా చోళీ లకు ఈ మగ్గం వర్క్ ద్వారానే డిజైనింగ్ చేస్తారు. నెమ్మదిగా ఈ సాంప్రదాయం మన దక్షిణాది రాష్ట్రాలకు కూడా పాకింది. అయితేదక్షిణాది రాష్ట్రాల్లో చీరలు ధరిస్తారు కనుక, మహిళలు ధరించే బ్లౌజులకు, ఈ మగ్గం వర్క్ ద్వారా డిజైన్ చేస్తున్నారు. మగ్గం వర్క్ చేయించిన బ్లౌజులకు పెద్ద మొత్తంలో ఛార్జి చేస్తారు.