రియల్ ఎస్టేట్ బిజినెస్: రియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగ్ విభాగానికి చాలా డిమాండ్ ఉంది. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో పార్ట్ టైం ద్వారా కూడా డబ్బు సంపాదించుకునే వీలుంది. మీకు చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్, క్లైంట్ లతో సంబంధాలు ఉంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి ఎంటర్ కావచ్చు. తద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఓపెన్ ప్లాట్స్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, విల్లాస్, ఫారం ల్యాండ్స్ వంటివి విక్రయించాల్సి ఉంటుంది. మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మారడం ద్వారా, మీ ఖాళీ సమయంలో డబ్బు సంపాదించుకునే వీలుంది.