Business Ideas: మహిళలూ ఇంటి వద్దే ఉంటూ, నెలకు రూ. 1 లక్ష సంపాదించే ఈజీ బిజినెస్ ఇదే..

First Published Dec 14, 2022, 5:25 PM IST

ప్రస్తుత కాలంలో ఇంట్లో భార్య భర్త ఇద్దరూ కలిసి పని చేస్తేనే కుటుంబం ముందుకు వెళ్లే పరిస్థితి నెలకొని ఉంది.  ముఖ్యంగా పెరుగుతున్న ఖర్చులతో మహిళలు పని చేయడం అనేది తప్పనిసరి అయింది. అదనపు ఆదాయం ఉంటేనే ఇల్లు గడిచే పరిస్థితి ఏర్పడుతోంది.  మరియు అదనపు ఆదాయం కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్నారా. అయితే ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ తో మీ ముందుకు వచ్చాం.

భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (NSIC)  కుటీర పరిశ్రమల ద్వారా ఆదాయం పొందాలి అనుకునేవారికి,  కొన్ని ప్రాజెక్టులను సిద్ధం చేసింది. ఇందులో పాపడ్ బిజినెస్ ఒకటి.  పాపడ్ బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటే మీరు ప్రభుత్వం నుండి చౌక వడ్డీ రేటుకే రుణం కూడా పొందవచ్చు. 
 

పాపడ్ బిజినెస్ లో ప్రారంభ పెట్టుబడి సుమారుగా 4 నుంచి 6 లక్షల రూపాయలు వరకూ అవుతుంది. సుమారు 30,000 కిలోల ఉత్పత్తి సామర్థ్యంతో మీరు ఈ బిజినెస్  స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్ కోసం, 250 చదరపు మీటర్ల స్థలం, కొన్ని యంత్రాలు , ఇతర పరికరాల కోసం  పెట్టుబడి పెట్టాలి. అదే సమయంలో, వర్కింగ్ క్యాపిటల్‌ కింద 3 నెలల జీతం, మూడు నెలల వరకూ ముడిసరుకు , ఉత్పత్తి ఖర్చులు కేటాయించుకోవాలి. అలాగే, మీరు స్థలాన్ని అద్దెకు తీసుకుంటే, అద్దె, విద్యుత్ , నీరు మొదలైన వాటి బిల్లు కూడా అందులో ఉంటుంది.
 

పాపడ్ బిజినెస్ పెద్ద ఎత్తున ప్రారంభించాలి అనుకుంటే,  3 పనివాళ్లు కూడా కావాలి. వీరిలో ఇద్దరు నైపుణ్యం కలిగి ఉన్నవారు, మరొకరు సూపర్‌వైజర్ అవసరం.పెట్టుబడి కోసం మీరు లోన్ పొందవచ్చు. కేంద్రం ముద్రా పథకం కింద, మీకు రూ. 4 లక్షల రుణం అందిస్తుంది. మీరు కేవలం రూ. 2 లక్షలు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. మీరు ఈ రుణాన్ని ఏదైనా ప్రభుత్వ బ్యాంకు నుండి పొందవచ్చు. ఈ లోన్ ను మీరు 5 సంవత్సరాల్లోగా తిరిగి చెల్లించాలి. 
 

పాపడ్‌ ప్యాకెట్లను మీరు హోల్‌సేల్ మార్కెట్‌లో విక్రయించడం ద్వారా ఎక్కువగా ఉత్పత్తి చేసే అవకాశం కలుగుతుంది. లేదంటే మీరు రిటైల్ దుకాణదారులు, సూపర్ మార్కెట్లు మొదలైనవాటికి కూడా సరఫరా చేయవచ్చు.ఈ అప్పడాల బిజినెస్ ద్వారా దాదాపు ప్రతి నెలా 1 లక్ష రూపాయల వరకూ సంపాదించే వీలుంది. ఖర్చులు పోనూ ప్రతి నెలా 35-40 వేల లాభం పొందవచ్చు.
 

NOTE: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారం ఆధారంగా మాత్రమే రూపొందించబడింది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణులను సంప్రదించడం మంచిది. 
 

click me!