ముందుగా మీ ఇంట్లోనే ఒక గదిని కేక్ తయారీ కోసం ప్రత్యేకంగా కేటాయించుకోవాల్సి ఉంటుంది. కేక్ తయారీ కోసం ఓవెన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సామర్థ్యాన్ని బట్టి దీని ధర ఉంటుంది. అలాగే ఒక ఫ్రీజర్ను కొనుగోలు చేయాలి. ఇక ముడి పదార్థాలను మీరు హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేయాలి, కోడిగుడ్లు మైదా పిండి, పంచదార, వెన్న వంటివి కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్యాకేజింగ్ కోసం కూడా ప్రత్యేకమైన సామాగ్రిని హోల్సేల్ ధరకే కొనుగోలు చేసుకోవాలి.